Parliament Winter Session : అందరి దృష్టి పార్లమెంటు సమావేశాలపైనే…అన్ని పార్టీ నేతల సమావేశం డిసెంబర్ 2న

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం డిసెంబర్ 4వతేదీన జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపైనే అందరి దృష్టి పడింది. పార్లమెంటు సమావేశాలకు ముందు డిసెంబరు 2వతేదీన ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది....

Parliament Session

Parliament Winter Session : దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం డిసెంబర్ 4వతేదీన జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపైనే అందరి దృష్టి పడింది. పార్లమెంటు సమావేశాలకు ముందు డిసెంబరు 2వతేదీన ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4వతేదీన ప్రారంభమై డిసెంబర్ 22వతేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : ఆస్తులు, కేసుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే అధికం…ఏడీఆర్ సంచలన నివేదిక వెల్లడి

పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, డిసెంబర్ 3న ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కారణంగా ఈసారి ఈ సమావేశాన్ని ఒక రోజు ముందుకు జరిపారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంమీ మహువా మోయిత్రాపై క్యాష్ ఫర్ క్వరీ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను కూడా ఈ సెషన్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్యానెల్ సిఫార్సు చేసిన బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి ఉంటుంది.

ALSO READ : Alert : చైనాలో హెచ్9ఎన్2 మహమ్మారి వ్యాప్తి…కేరళలో ఆరోగ్యశాఖ అధికారుల అలర్ట్

ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఎవిడెన్స్ యాక్ట్‌లకు ఉద్దేశించిన మూడు ముఖ్యమైన బిల్లులపై చర్చించే అవకాశం ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక జరగనున్న పార్లమెంటు సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. దీనికితోడు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎంపీలు ఎం చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది.