Rajastan Gang Rape
Rajastan Gang Rape : రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐటీ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ యువతిపై గ్యాంగ్‌రేప్‌కు గురైంది. ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి యువతిని కారులో ఎక్కించుకున్న వారు.. కదులుతున్న కారులోనే సదరు యువతిపై సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్లో ఓ మహిళలు కూడా ఉంది. అయితే, ఈ ఘటన కారులోని వెబ్‌క్యామ్‌లో రికార్డు అయింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.. అయితే, యువతిపై అత్యాచారంకు పాల్పడింది.. తాను పనిచేస్తున్న సంస్థ సీఈవోతోపాటు సంస్థ ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : Indian Student Killed: కెనడాలో దారుణం.. మరో భారతీయ విద్యార్థి దారుణ హత్య..
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో జేకేఎం అనే ఐటీ కంపెనీ సీఈవో జీతేశ్ సిపోడియా తన పుట్టిన రోజు, న్యూఇయర్ కు సంబంధించి ఈనెల 20వ తేదీన ఓ హోటల్లో విందు ఏర్పాటు చేశాడు. ఆ సంస్థకు చెందిన మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ శిల్పా సిరోహి ఆహ్వానించడంతో బాధితురాలు కూడా ఆ పార్టీకి అటెండ్ అయింది. రాత్రి 1.30 గంటల సమయంలో ఆమెకు కాస్త అనారోగ్యంగా ఉండటంతో ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. అయితే, మీ ఇంటి వద్ద దింపుతానంటూ శిల్పా సిరోహి బాధిత యువతిని కారులో ఎక్కించుకుంది. అప్పటికే ఆ కారులో శిల్ప భర్త గౌరవ్, సంస్థ సీఈవో జీతేశ్ ఉన్నారు.
మార్గం మధ్యలో శిల్ప సిరోహి కారును ఆపేసింది. కారులో నుంచి అందరూ కిందికిదిగారు. ముగ్గురూ పొగపీల్చే పదార్థాలను తీసుకున్నారు. అక్కడే ఉన్న బాధిత యువతితోనూ బలవంతంగా మత్తు పదార్థంతో కూడిన ఆ పొగను తాగించారు. ఆ తరువాత మళ్లీ వారు కారులో బయలుదేరారు. మత్తుతో కూడిన పొగను పీల్చడంతో బాధిత యువతి కారులో స్పహకోల్పోయింది. దీంతో జితేశ్‌తోపాటు గౌరవ్ ఆమెపై లైంగికదాడికి యత్నించారు. బాధిత యువతి మత్తు నుంచి తేరుకోగా.. తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని గ్రహించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది.
జరిగిన ఘటపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘోరానికి సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. అయితే, కారులోని వెబ్‌క్యామ్‌లో నిందితులు పాల్పడిన దారుణానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ పుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధిత యువతిపై దారుణానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.