ఇక సూర్యుడిపై ఫోకస్ : చంద్రయాన్-2 ఆర్బిటర్ పనితీరు అద్భుతం: ఇస్రో చైర్మన్

  • Published By: sreehari ,Published On : September 26, 2019 / 01:29 PM IST
ఇక సూర్యుడిపై ఫోకస్ : చంద్రయాన్-2 ఆర్బిటర్ పనితీరు అద్భుతం: ఇస్రో చైర్మన్

Updated On : September 26, 2019 / 1:29 PM IST

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆర్బిటర్ అద్భుతంగా పనిచేస్తుందని చైర్మన్ కే. శివన్ తెలిపారు. అది చేయాల్సిన అన్ని ప్రయోగాలకు సంబంధించి పనులను కూడా ప్రారంభించిందని ఆయన అన్నారు.

గురువారం (సెప్టెంబర్ 26, 2019) శివన్ మీడియాతో అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ ల్యాండ్ అయ్యే క్రమంలో భూకేంద్రంతో కమ్యూనికేషన్ కోల్పోడానికి వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది అనేదానిపై జాతీయ స్థాయి కమిటీ విశ్లేషిస్తున్నట్టు చెప్పారు. 

ఇస్రో తదుపరి ప్రయోగాలపై ఫోకస్ పెట్టిందని, సూర్యగ్రహంపై ప్రయోగాలు చేసేందుకు అంతరిక్షానికి భారత అంతరిక్ష నౌకలో మనుషులను పంపునున్నట్టు చెప్పారు. చిన్న శాటిలైట్లను లాంచ్ చేసేందుకు ఒక రాకెట్ పై కూడా ఇస్రో పనిచేస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి చంద్రయాన్-2 ప్రయోగం.. చివరి క్షణాల్లో ఫెయిల్ అయింది. చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది.

అప్పటినుంచి ఇప్పటివరకూ విక్రమ్ ఆచూకీ లేదు. ల్యాండర్ తో కమ్యూనికేషన్ కోసం ఇస్రో ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆఖరికి నాసా రంగంలోకి దిగి విక్రమ్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించి ఏం చేయలేక చేతులేత్తేసింది. విక్రమ్ చాప్టర్ ముగిసింది.