Chandrayaan-3 Launch
Chandrayaan-3: జాబిల్లిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం మధ్యాహ్నం శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యుల్‌ను మోసుకొని ఈ అత్యంత శక్తిమంతమైన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రానికి కొద్దిదూరంలో ఉండి వీడియోలు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Chandrayaan-3: అప్పుడే చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించిన చంద్రయాన్-3
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న చంద్రయాన్ -3ని విమానంలో నుంచి ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను ఇస్రో మెటీరియల్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న డా. పీవీ వెంకటకృష్ణనన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. చంద్రయాన్ -3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్న సమయంలో రాకెట్ వెళ్తున్న దృశ్యాలను వీక్షించాలంటూ ఆ విమానంలోని పైలట్ స్వయంగా ప్రయాణికులకు చెప్పినట్లు వెంకటకృష్ణనన్ తెలిపారు.
Launch of Chandrayan 3 from flight. Sometime after takeoff from Chennai to Dhaka flight, pilot announced to watch this historical event pic.twitter.com/Kpf39iciRD
— Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) July 15, 2023