Chandrayaan-3: అప్పుడే చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించిన చంద్రయాన్-3
ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ చంద్రయాన్-3లో ఉన్నాయని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Graphic image
ISRO-Chandrayaan-3: చంద్రయాన్-3ని ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ కక్ష్యలో వదిలినట్లు ఇస్రో తెలిపింది. రాకెట్ లాంచింగ్ ప్రారంభమైన 40 నిమిషాలకు ఇస్రో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. చంద్రయాన్-3 ఖచ్చితమైన కక్ష్యలోకి వెళ్లిందని, చంద్రుని దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. అలాగే అంతరిక్ష నౌక సాధారణంగా ఉందని ఇస్రో వెల్లడించింది.
Telangana BJP: కమలం పార్టీకి మరో కొత్త చిక్కు.. నెత్తి నొప్పి తెచ్చిన నేతల భద్రత
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం ఘన విజయం సాధించింది. ముందుగా అనుకున్న సమయం ప్రకారం.. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. సరిగ్గా మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే, వచ్చే నెలలో చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా, చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది.
Salt Treatment : ఉప్పులో పాతేస్తే ఒత్తిడి పోతుందట .. సాల్ట్ ట్రీట్‌మెంట్‌తో సాటిలేని ప్రయోజనాలు
ఈ రాకెట్ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపారు. రాకెట్ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్ మాడ్యూల్, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్ ల్యాండర్, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ చంద్రయాన్-3లో ఉన్నాయని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్-3 రాకెట్‌ను ప్రయోగించారు.
Bihar : సాంబార్ లేకుండా కస్టమర్‌కి దోశ అందించిన రెస్టారెంట్.. రూ.3,500 ఫైన్ వేసిన కోర్టు
చంద్రయాన్ -3ని భూమి చుట్టూఉన్న 170 X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెడుతుంది. అది 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను ట్రాన్స్‌లూనాల్ ఇంజెక్షన్స్ (టీఎల్ఐ)గా పేర్కొంటారు. ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్ తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6వేల కిలో మీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళ్తుంది. నాలుగు ఇంజన్ల ససాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది.