Bihar : సాంబార్ లేకుండా కస్టమర్‌కి దోశ అందించిన రెస్టారెంట్.. రూ.3,500 ఫైన్ వేసిన కోర్టు

దోశ ఆర్డర్ చేస్తే సాంబార్ ఇవ్వలేదు ఓ రెస్టారెంట్ నిర్వాహకులు.. ఎందుకని అడిగిన కస్టమర్‌ను అగౌరవంగా మాట్లాడారు. అందుకు పరిహారం అందుకున్నారు.. ఏం జరిగిందో చదవండి.

Bihar : సాంబార్ లేకుండా కస్టమర్‌కి దోశ అందించిన రెస్టారెంట్.. రూ.3,500 ఫైన్ వేసిన కోర్టు

bihar

Updated On : July 14, 2023 / 2:37 PM IST

Bihar : బీహార్ బక్సర్‌లోని ఓ రెస్టారెంట్ కస్టమర్‌కు దోసెతో సాంబార్ అందించనందుకు కోర్టు రూ.3,500 జరిమానా విధించింది. విచిత్రంగా ఉందా? నిజం. ఇది ఇప్పటి సంగతి కాదు.. గతేడాది జరిగిన సంఘటన అయినా తాజాగా వైరల్ అవుతోంది.

Tomato : ఇదేందయ్యా ఇది ఏడా సూడలె.. టమాటా ఎఫెక్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆ బోర్డులు చూసి కస్టమర్లు షాక్

బక్సర్‌లోని ‘నమక్’ అనే రెస్టారెంట్‌కి మనీష్ గుప్తా అనే లాయర్ వచ్చారు. అక్కడ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇక అక్కడ రూ.140 రూపాయలు ధర ఉన్న ప్రత్యేక మసాలా దోశను ఆర్డర్ ఇచ్చారు. అయితే రెస్టారెంట్ నిర్వాహకులు దోశతో పాటు సాంబార్ ఇవ్వలేదు. సాంబార్ రాలేదని రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించడంతో అతను మనీష్ గుప్తాతో అమర్యాదగా మాట్లాడినట్లు తెలుస్తోంది. పైగా దోశ కోసం చెల్లించిన రూ.140 యజమాని మనీష్‌కి  తిప్పికొట్టాడు. యజమాని వైఖరితో సంతృప్తి చెందని గుప్తా నమక్ హోటల్‌కి లీగల్ నోటీసులు పంపారు. ఈ విషయంలో రెస్టారెంట్ స్పందించకపోవడంతో మనీష్ అక్కడితో ఆగకుండా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

Haryana : రెస్టారెంట్లు 24 గంటలు తెరిచి ఉంటాయి…

11 నెలల సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత వినియోగదారుల కోర్టు ఎట్టకేలకు తీర్పు ఇచ్చింది. వినియోగదారుల కమిషన్ చైర్మన్ వేద్ ప్రకాష్ సింగ్ మరియు సభ్యుడు వరుణ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషనర్ మనీష్ గుప్తాకు మానసిక, శారీరక, ఆర్ధిక ఇబ్బందులను కలిగించినందుకు నమక్ రెస్టారెంట్‌ను దోషిగా తేల్చింది. రెస్టారెంట్‌కు రూ.3,500 జరిమానా విధించింది. సాంబార్ అడిగిన కస్టమర్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో పాపం ఆ రెస్టారెంట్ యజమానికి అనుభవ పూర్వకంగా తెలిసింది.