నటుడు సోనూసూద్ సేవలకు అమెరికా షెఫ్ ఫిదా..కొత్తరకం డిష్ చేసి సోనూ ఊరు పేరుపెట్టి కృతజ్ఞతలు

  • Published By: nagamani ,Published On : May 21, 2020 / 07:30 AM IST
నటుడు సోనూసూద్ సేవలకు అమెరికా షెఫ్ ఫిదా..కొత్తరకం డిష్ చేసి సోనూ ఊరు పేరుపెట్టి కృతజ్ఞతలు

Updated On : May 21, 2020 / 7:30 AM IST

లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారికి‌ ఎన్నోరకాల సేవలు అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ప్రముఖ సినీనటుడు సోనూ సూద్. రీల్ లో విలన్ గా నటిస్తూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో కష్టాల్లోఉన్నవారికి ఆపద్భాంధవుడిలా నిలిచారు. రియల్ హీరోఅనిపించుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో పలు ఇబ్బందులకు గురైవుతున్నవారికి సోనూ చేస్తున్న విశిష్ట సేవల గురించి తెలుసుకున్న అమెరికాలో ఉంటున్న ప్రఖ్యాత చెఫ్‌ వికాస్‌ ఖన్నా కృతజ్ఞతలను తన ప్రొఫెషన్ స్టైల్లో తెలిపారు. కొత్త వంటకం చేసి దానికి సోనూ సూద్‌ సొంత ఊరి పేరు ‘మోగా’ అని పేరు పెట్టాడు.

ఓ మెసేజ్ కూడా పెడుతూ..’డియర్ సోనూ సూద్‌ బాయ్‌… మీరు ప్రతిరోజు మాలో స్ఫూర్తిని నింపుతున్నారు. కానీ కరోనా కల్లోలంలో ఇప్పట్లో మీకు వండి పెట్టలేను.. కొత్త డిష్ తయారు చేసి దానికి మీరు పుట్టిన ఊరు మోగాగా పేరు పెడుతున్నాను’ అని చెబుతూ..ఆ కొత్త వంటకం ఫొటోను పోస్ట్ చేశాడు. దీనికి సోనూ కూడా హ్యాఫీ ఫీలవుతూ..మీరు మాకు ఇచ్చిన గౌరవానికి తన సొంత ఊరు గర్వపడుతుందని చెప్పాడు. 

దేశ వ్యాప్తంగా వలస కార్మికులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుంటూ..కాలినడకన ఇళ్లకు వెళుతున్నారు. ఈ దారిలో వారు పడుతున్న బాధలకు సోనూసూద్ చలించిపోయారు. అటువంటివారికి సోనూ బస్సు సౌకర్యాలు కల్పిస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. 

ఇప్పటికే ముంబైలో చిక్కుకున్న కర్ణాటక వలస కూలీలను పది బస్సుల్లో వారి గ్రామాలకు పంపించాడు. అంతేకాదు..కరోనాతో యద్ధం చేస్తన్న పంజాబ్‌లోని డాక్టర్లకు వ్యక్తిగత రక్షణ కిట్లు అందించారు. ముంబైలో తనకున్న హోటల్‌లో వైద్య సిబ్బందికి ఎకామిడేషన్  ఏర్పాటు చేశాడు.

Read:  నేపాల్ పాపాల్ : చైనా కంటే ఇండియా వైరస్ డేంజరంట