Anand Mahindra : చదరంగంలో పావులు ప్రాణంతో వచ్చి యుద్ధం చేస్తే..ఇట్లుంటది..: ప్రముఖులు మెచ్చిన వీడియో
చదరంగం బోర్డుపై పావులు సజీవ రూపాలుగా మారి కళ్లముందుకొస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండీ..భటుడు,గుర్రం,ఏనుగు, రాజు, మంత్రి సజీవ రూపాలుగా మారి మన కళ్లముందే యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టిన వీడియోను వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా పోస్ట్ చేశారు..ఈ వీడియో వైరల్ అవుతోంది.

Chess Pieces Come Alive
Chess pieces come alive Anand Mahindra video..: చదరంగం బోర్డుపై పావులు సజీవ రూపాలుగా మారి కళ్లముందుకొస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండీ..భటుడు,గుర్రం,ఏనుగు, రాజు, మంత్రి సజీవ రూపాలుగా మారి మన కళ్లముందే యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రా షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కొట్టాయ్ కలెక్టర్ కవితా రాము స్వయంగా కొరియో గ్రఫీతో ఈ వీడియోకు ప్రాణం పోశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ ద్వారా పరిచయం చేస్తూ ఆనంద్ మహేంద్రా చదరంగం బోర్డుపై పాములు సజీవరూపాలను కళ్లకు కట్టారంటూ వ్యాఖ్యానించారు.
‘‘అద్భుతం. పుదుక్కొట్టాయ్ కలెక్టర్ కవితారాము కొరియోగ్రఫీ చేసినట్టు నాకు చెప్పారు. చదరంగంలో పావులు సజీవంగా వస్తే ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇది ప్రామాణికతను కలిగి ఉంది. మన దేశంలో కనుగొనబడిన గేమ్ ఇది’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఈ వీడియోను పుదుక్కొట్టాయ్ జిల్లా యంత్రాంగం రూపొందించింది. ఈ అందమైన డ్యాన్స్ వీడియోను తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మెచ్చుకున్నారు. జిల్లా అధికార యంత్రాంగం చెస్ ఒలింపియాడ్ 2022ను ప్రచారం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుందని ప్రశంసించారు.
కాగా చదరంగంలోని పావులతో ఎత్తుకు పైఎత్తులు వేయడం, గెలుపు సాధించడం భలే మజానిస్తుంది. ప్లాస్టిక్ లేదా చెక్క బోర్డుపై పావులతో చెస్ ఆడడం గురించి తెలుసు. కానీ..పావుల స్థానంలో మనుషులే పాత్రధారులైతే ఎలా ఉంటుందో పుదుక్కొట్టాయ్ జిల్లా యంత్రాంగం కళ్లకు కట్టిన ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి..
Superb. Choreographed, I’m told, by Ms Kavitha Ramu, Collector Pudukkottai. Makes the chess pieces come alive in our imagination. Also it has authenticity, given the game was invented in India. Bravo! pic.twitter.com/BZCQvluyFz
— anand mahindra (@anandmahindra) July 29, 2022