Fee Reimbursement: చర్చలు సఫలం.. యథావిధిగా కాలేజీలు.. 7 రోజుల్లో 600 కోట్లు..
దీపావళికి మరో 600 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చింది.

Fee Reimbursement: ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వారం రోజుల్లో 600 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో 600 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో బంద్ ప్రతిపాదనను కాలేజీల యాజమాన్యాలు విరమించకున్నాయి. మంగళవారం నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి.
పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తెచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని విచ్చిన్నం చేసిందని ఆయన ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ భారాన్ని బీఆర్ఎస్ సర్కార్ మాపై పెట్టి వెళ్లిందన్నారు. గత ప్రభుత్వం మాపై నెట్టిన భారాన్ని నెమ్మదిగా పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ టోకెన్ల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
భవిష్యత్ లో మిగతా పెండింగ్ బిల్లులను దశల వారీగా క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయానికి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సహకరిస్తున్నాయని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కాలేజీలు, అధికారుల ఆధ్వర్యంలో రెండు మూడు రోజుల్లో కమిటీ వేయనున్నామన్నారు.
కాలేజీల బంద్ ను ను విరమించుకుంటున్నామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారాయన.
Also Read: బండి సంజయ్‌పై రూ.10 కోట్లకు కేటీఆర్ పరువు నష్టం దావా..