CM Bhupesh Baghel : గులాబీ పువ్వు ఇచ్చి తిలకం దిద్దిన భార్య .. సీఎం భూపేష్ బఘేల్ ఎమోషనల్ ట్వీట్

ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్నికలు జరుగనున్న క్రమంలో సీఎం భూపేష్ బఘేల్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సీఎం భూపేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

CM Bhupesh Baghel : గులాబీ పువ్వు ఇచ్చి తిలకం దిద్దిన భార్య .. సీఎం భూపేష్ బఘేల్ ఎమోషనల్ ట్వీట్

Chhattisgarh CM Bhupesh Baghel

Updated On : October 30, 2023 / 3:40 PM IST

Chhattisgarh CM Bhupesh Baghel nomination: తెలంగాణ, రాజస్థాన్​, మిజోరం, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగునున్నాయి. దీంట్లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్నికలు జరుగనున్న క్రమంలో సీఎం భూపేష్ బఘేల్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం (అక్టోబర్ 30,2023) పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సీఎం భూపేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లే క్రమంలో ఆయన భార్య ముక్తేశ్వరి సీఎంకు తిలకం దిద్ది హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఓ గులాబీ పువ్వు కూడా ఇచ్చారు. భార్య ముక్తేశ్వరి ఇచ్చిన గులాబీ పువ్వును సీఎం భూపేష్ తన కోటు జేబులో పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్టర్ లో ఇలా పేర్కొన్నారు. ‘‘ ప్రతిసారీ నేను మొదటిసారి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళిన రోజు గుర్తుకు వస్తుంది. ఈ రోజు నేను పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి భిలాయ్ నివాసం నుండి బయలుదేరాను. నా భార్య ముక్తేశ్వరి ప్రతిసారీ తిలకం దిద్దుతుంది. మీ ప్రేమే నా బలం. ఛత్తీస్‌గఢ్ ఆత్మగౌరవం కోసం, మీ అందరికీ సేవ చేయడానికి నేను ఎల్లప్పుడూ అంకితభావంతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాను” అని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ట్వీట్ చేశారు.

యూత్ కాంగ్రెస్ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూపేష్ సీఎం స్థాయికి ఎదిగారు. ఇదే సీటు నుంచి ఆయన ఐదుసార్లు 1993, 1998, 2003, 2013, 2018లో గెలుపొందారు. మొదటిసారిగా ఆయన 1993లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.