Chhattisgarh CM: దేశంలోనే తొలిసారిగా ఆవు పేడతో తయారు చేసిన బ్రీఫ్‌కేస్‌లో “రాష్ట్ర బడ్జెట్”

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఆవు పేడతో తయారు చేసిన బ్రీఫ్‌కేస్‌లో "రాష్ట్ర బడ్జెట్" ప్రతులను పొందుపరుస్తూ బఘెల్ బడ్జెట్‌ను సమర్పించారు.

Chhattisgarh CM: దేశంలోనే తొలిసారిగా ఆవు పేడతో తయారు చేసిన బ్రీఫ్‌కేస్‌లో “రాష్ట్ర బడ్జెట్”

Cow Dung Briefacse

Updated On : March 9, 2022 / 10:34 PM IST

Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో స్వయం ఉపాధి సంఘాలకు, గ్రామాభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం భూపేష్ బఘెల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ సందర్భంగా సీఎం భూపేష్ బఘెల్ ఒక ప్రత్యేకత చాటుకున్నారు. ఆవు పేడతో తయారు చేసిన బ్రీఫ్‌కేస్‌లో “రాష్ట్ర బడ్జెట్” ప్రతులను పొందుపరుస్తూ బఘెల్ బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బ్రీఫ్‌కేస్‌పై “ధనలక్ష్మి ఆవు పేడలో నివసిస్తుందని” అర్ధం వచ్చేలా ‘గోమయ్ వసతే లక్ష్మి’ అని సంస్కృతంలో రాసిఉంది.

Also read:David Bennett : పంది గుండె అమర్చిన మొదటి వ్యక్తి మృతి!

సాధారణంగా, బడ్జెట్ కాపీని తీసుకెళ్లడానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు తోలు(leather) లేదా జనపనారతో చేసిన బ్రీఫ్‌కేస్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే ఆవుపేడతో తయారు చేసిన బ్రీఫ్‌కేస్‌ని బడ్జెట్‌ను తీసుకురావడం దేశంలోనే ఇది తొలిసారి. అంతేకాదు బడ్జెట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బ్రీఫ్‌కేస్‌ లో మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లోని రాయ్‌పూర్ గోకుల్ ధామ్ గౌతమ్‌లో పనిచేస్తున్న’ఏక్ పహల్’ అనే మహిళా స్వయం సహాయక బృందం ఈ బ్రీఫ్‌కేస్‌ని తయారు చేశారు. ఆవు పేడ, సున్నం పొడి, మైదా, చెక్క పొడి, గారెల మిశ్రమాన్ని పొరల వారీగా రాసి 10 రోజుల పాటు కష్టపడి దీన్ని తయారు చేశారు. బ్రీఫ్‌కేస్‌ హ్యాండిల్ మరియు మూలను కొండగావ్ నగరంలోని బస్తర్ ఆర్ట్ ఆర్టిసన్స్ గ్రూప్ సభ్యులు తయారు చేశారు.

Also read: Nokia Flagship Phones : నోకియా ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు స్వస్తి పలికినట్టేనా?!

ఛత్తీస్‌గఢ్‌లో ఆవు పేడని లక్ష్మికి ప్రతీకగా భావిస్తారు. రాష్ట్రంలో తీజ్ పండుగల సమయంలోనూ ప్రజలు తమ ఇళ్లను ఆవు పేడతో అలికి సుందరంగా ముస్తాబు చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ‘ఏక్ పహల్’ స్వయం సహాయక సంఘాల మహిళలు గోమాయ్ బ్రీఫ్‌కేస్‌ను తయారు చేశారు. ఈ బ్రీఫ్‌కేస్ నుండి బడ్జెట్ రూపంలో ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతి ఇంటికి లక్ష్మి ప్రవేశిస్తుందని దీంతో రాష్ట్రంలోని ప్రతి గృహం ఆర్థికంగా బలోపేతం అవుతుందని బడ్జెట్ మీటింగ్ సందర్భంగా రాష్ట్ర మంత్రులు మీడియాకు తెలిపారు. కాగా.. ఆవుల పెంపకందారులను ప్రోత్సహిస్తూ.. ఆవులను సంరక్షించేలా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా ఆవుల పకం రైతుల నుంచి పేడను కొనుగోలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలా సేకరించిన ఆవు పేడతో వర్మీకంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఆవు పేడతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Also read: Covovax India : భారత్‌లో మరో కొవిడ్ టీకా.. 12ఏళ్ల నుంచి 17ఏళ్ల పిల్లలకు..!