Man life ended goat's eye
Man life ended goat’s eye : అనుకున్న కోరికలు నెరవేరితే కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇస్తుంటారు. అలా ఓ వ్యక్తి ఓ మేకను బలి ఇచ్చారు. కానీ అదే మేక అతని ప్రాణం పోవడానికి కారణమైంది. బలి ఇచ్చిన ఆ మేక కన్ను వల్ల ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ వింత ఘటన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని సూరజ్‌పూర్ జిల్లా (Surajpur District)లో జరిగింది.
సూరజ్‌పూర్ జిల్లాలోని ఖోపాధామ్‌లో బగర్ సింగ్ అనే 50 ఏళ్ల వ్యక్తి కుటుంబంతో జీవిస్తున్నాడు. అతను తన కోరిక తీరితే మేకను బలి ఇస్తానని మొక్కుకున్నాడు. అతను అనుకున్నది జరగడంతో మొక్కు తీర్చుకోవాలనుకున్నాడు. గత సోమవారం (జులై 3, 2023) ఖోపా ధామ్ కు పర్రి అనే మతపరమైన ప్రాంతంలో స్నేహితులు, బంధువులతో కలిసి వెళ్లి మేకను బలి ఇచ్చాడు. అందరికి విందు ఏర్పాటు చేశాడు. మేక మాంసాన్ని రకరకాలుగా వండారు. తలకాయ మాంసాన్ని విడిగా ప్రత్యేకంగా వండారు. వచ్చినవారందరికి భోజనాలు వడ్డించారు.
CM Yogi Adityanath Sister : చిన్న టీకొట్టుతో యూపీ సీఎం యోగీ సోదరి జీవనం ..
మేక మాంసం ముక్కలున్నాయి. దీంతో బగర్ సింగ్ తన స్నేహితులతో కలిసి చుక్క (మద్యం) కూడా ఏర్పాటు చేశాడు. చక్కగా అందరు ముక్క చుక్కలతో ఎంజాయ్ చేస్తున్నారు. బగర్ సింగ్ మాంచి హ్యాపీగా ఉన్నాడు. స్నేహితులతో జోకులు వేస్తు చక్కగా ఎంజాయ్ చేస్తు తలకాయ మాంసాన్ని లాగిస్తున్నారు. చక్కగా హ్యాపీగా తలకాయ మాంసం తింటున్న బగర్ సింగ్ ఓ ముక్క తీసుకుని నోట్లో వేసుకుని గుటుక్కున మింగాడు. అది మేక కన్ను. అదికాస్తా బగర్ సింగ్ గొంతులో ఇరుక్కుపోయింది. కిందకు దిగటం లేదు.. పైకి రావటంలేదు. దీంతో అతను శ్వాస ఆడక విలవిల్లాడిపోయాడు.
దీంతో స్నేహితులు, బంధువులు వెంటనే సూరజ్‌పూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే చనిపోయాడు. మొక్కు చెల్లించుకున్న వ్యక్తి అదే మేక కన్ను గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోవటంతో స్థానికంగా విషాదం నెలకొంది. మొక్కులు తీర్చుకున్న అదే వేడుకలో అతను చనిపోవటంతో కుటుంబ సభ్యులు భోరుమని ఏడ్చారు. సంతోషం కాస్త ఆవిరై.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Car Accident: వామ్మో..! రెప్పపాటులో దూసుకొచ్చిన మృత్యువు .. వీడియోచూస్తే వణుకు పుట్టడం ఖాయం..