Car Accident: వామ్మో..! రెప్పపాటులో దూసుకొచ్చిన మృత్యువు .. వీడియోచూస్తే వణుకు పుట్టడం ఖాయం..
కోహిమా నుంచి దిమాపుర్ జాతీయ రహదారిపై ఆగిఉన్న కార్లను పెద్ద బండరాయి వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Massive rock crushes cars during landslide
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో వేగంగా దూసుకొచ్చిన బండరాయి కారును ఢీకొట్టింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో పక్కనే ఉన్న రెండు కార్లుసైతం ధ్వంసం అయ్యాయి. ఈ వీడియోలో వేగంగా కారు మీదకు పెద్ద బండరాయి దూసుకెళ్లడం చూస్తే భయం పుట్టడం ఖాయం. ఈ ఘటన నాగాలాండ్‌లోని చుమౌకేదిమా జిల్లాలో చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో పెద్ద బండరాయి వేగంగా దొర్లుకుంటూ వచ్చి కారును ఢీకొట్టింది.
నాగాలాండ్ రాజధాని కోహిమాలో మంగళవారం వర్షం కురిసింది. ఈ క్రమంలో కోహిమా నుంచి దిమాపుర్‌వైపు 29వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పకల్ పహర్ వద్ద వాహనాలు వరుసగా నిలిచిపోయాయి. రోడ్డుకు ఆనుకొనిఉన్న కొండపైనుంచి పెద్ద బండరాయి వేగంగా దూసుకొచ్చింది. రెప్పపాటులో కారుపైనుంచి దూసుకెళ్లింది. కారులోని వారు తప్పించుకొనే అవకాశంకూడా లేకుండాపోయింది. బండరాయి కారుపైనుంచి వెళ్లడంతో కారుపైభాగం నుజ్జునుజ్జు అయింది. ఆ తరువాత రాయి దొర్లుకుంటూ మరో రెండు కార్లను ఢీకొట్టింది. అవికూడా ధ్వంసం అయ్యాయి.
ప్రమాదం సమయంలో కారులోని ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దుర్ఘటనపై నాగాలాండ్ సీఎం నెప్యూ రియో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా అధికారులను సీఎం ఆదేశించారు.
#WATCH | A massive rock smashed a car leaving two people dead and three seriously injured in Dimapur's Chumoukedima, Nagaland, earlier today
(Viral video confirmed by police) pic.twitter.com/0rVUYZLZFN
— ANI (@ANI) July 4, 2023