ఆడుతు పాడుతూ.. పనిచేస్తుంటే : డాన్స్ తో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న పోలీస్

  • Published By: veegamteam ,Published On : December 7, 2019 / 05:44 AM IST
ఆడుతు పాడుతూ.. పనిచేస్తుంటే : డాన్స్ తో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న పోలీస్

Updated On : December 7, 2019 / 5:44 AM IST

రోడ్డుపై డాన్స్ లు చేస్తూ..ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్న పోలీస్ వీడియో వైరల్ గా మారింది. ఆడుతు..పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అన్నట్లుగా ఛత్తీస్ గడ్ లోని రాయ్ పూర్ లో ఓ ట్రాఫిక్ పోలీస్ స్పెషల్ స్టెప్ లతో వాహనదారుల్ని అలరిస్తున్నాడు. 

వైట్ షర్ట్ బ్లాక్ పాంట్ వేసుకున్న 35 సంవత్సరాల ట్రాఫిక్ పోలీస్ మహ్మద్ మొహ్సిన్ షేక్ డ్యాన్స్ తో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద  అతన్ని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. డ్యాన్స్ తో చేస్తూ.. డ్యూటీని ఎంజాయ్ చేస్తున్న  పోలీస్ మహ్మద్ మొహ్సిన్ షేక్ ను అభినందిస్తున్నారు. 

మహ్మద్ మాట్లాడుతూ..ప్రజలు ఎటువంటి ప్రమాదాలకు గురవ్వవకుండా ఉండేందుకు ట్రాఫిక్స్ నియంత్రిస్తూ..డ్యూటీ చేయటమంటే తనకు చాలా ఇష్టమనీ..నా డ్యూటీని నేను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాననీ నా ఉద్యోగాన్ని ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పాడు. తన డ్యాన్స్ తో పాదచారులు..వాహనదారులు చాలా ఎంజాయ్ చేస్తారని అది తనకు చాలా చాలా ఆనందాన్నిస్తుందని అన్నాడు.  ప్రజల ఆనందమే నా ఆనందమనీ అన్నాడు డ్యాన్సింగ్ ట్రాఫిక్ పోలీస్ మహ్మద్.

కాగా మధ్యప్రదేశ్ లో ట్రాఫిక్ పోలీస్ రంజిత్ సింగ్ డ్యాన్సింగ్ వీడియోను తాను చూశాననీ..అతని స్ఫూర్తితోనే వర్క్ ను ఎంజాయ్ చేస్తూ..చేస్తుంటే ప్రజలు కూడా ట్రాఫిక్ రూల్స్ ను చక్కగా పాటిస్తారని తెలుసుకుని నేను కూడా అలా చేస్తున్నాననీ..డ్యాన్సింగ్ డ్యూటీతో ప్రజలకు చక్కగా ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తున్నారని చెప్పాడు మహ్మద్ మొహ్సిన్ షేక్.