ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రేంజ్ పరిధిలోని దంతెవాడ – నారాయణపుర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్ జరిగి 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
అబూజ్‌మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఆ సమయంలో వారిని చూసిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో 30 మంది మావోయిస్టులు హతమయ్యారు.
ఆ 30 మంది మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతం నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్ సహా ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, ఈ ఏడాదిలో బస్తర్‌లో 186 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందారు.
పవన్ కల్యాణ్ “సనాతన ధర్మం” వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ స్పందన