పవన్ కల్యాణ్ “సనాతన ధర్మం” వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ స్పందన

పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధిని మీడియా ప్రశ్నించగా..

పవన్ కల్యాణ్ “సనాతన ధర్మం” వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ స్పందన

Udayanidhi stalin, Pawan Kalyan

Updated On : October 4, 2024 / 3:36 PM IST

Udhayanidhi Stalin: సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ వంటిదని దాన్ని నిర్మూలించాలని గతంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో గురువారం తిరుమలలో నిర్వహించిన వారాహి సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని అన్నారు. దీనిపై ఇవాళ ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. పవన్ వ్యాఖ్యలపై స్పందన ఏంటంటూ ఉదయనిధిని మీడియా ప్రశ్నించగా.. “వేచి చూద్దాం” అంటూ రిప్లై ఇచ్చారు.

కాగా, వారాహి డిక్లరేషన్‌పై సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పటిష్ఠమైన జాతీయ చట్టం అవసరమని చెప్పారు. భారత్ అంతటా ఒకేలా దాన్ని అమలు చేయాలని, ఈ చట్టం అమలును పర్యవేక్షించడానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ను ఏర్పాటు చేయాలని అన్నారు.

ఈ బోర్డు, దాని కార్యకలాపాల కోసం వార్షిక నిధులను తప్పనిసరిగా కేటాయించాలని చెప్పారు. ఆలయాల్లోని ప్రసాదాలు, వాటిలో వినియోగించే పదార్థాల్లో స్వచ్ఛత ఉండేలా చూడాలని అన్నారు. సనాతన ధర్మాన్ని కించపరిచే లేదా ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు లేదా సంస్థలకు సహకరించకూడదని చెప్పారు.

KA Paul: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో కేఏ పాల్ పిటీషన్.. ఇప్పటికిప్పుడు అలా చేయలేమన్న కోర్టు