Vaccine : పిల్లల కోసం ప్రత్యేక టీకా.. అతిత్వరలో అందుబాటులోకి

జైడస్ క్యాడిలా రూపొందించిన టీకాను జాతీయ కోవిడ్ టీకా డ్రైవ్ లోకి ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. ధర ఇంకా నిర్ణయించలేదని, మూడు డోసుల టీకా కావడంతో భిన్నంగా ఉంటుందని పేర్కొంది.

Vaccine

Vaccine : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 87 కోట్ల మందికి సింగిల్ డోస్ టీకా పూర్తైంది. ఇక త్వరలో 12 ఏళ్ళు పైబడిన పిల్లలకు కోవిడ్ టీకా వేయనున్నారు. జైడస్ క్యాడిలా రూపొందించిన టీకాను జాతీయ కోవిడ్ టీకా డ్రైవ్ లోకి ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. ధర ఇంకా నిర్ణయించలేదని, మూడు డోసుల టీకా కావడంతో భిన్నంగా ఉంటుందని పేర్కొంది. 12 ఏళ్లు పైబడిన పిల్లలతో పాటు పెద్దల కోసం జైడస్‌ క్యాడిలా జైకోవ్‌-డీ పేరుతో వ్యాక్సిన్‌ తయారు చేసింది. ఇప్పటికే డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా గత నెల 20న అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.

Read More : Corona Cases : ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఈ రోజు ఎన్నంటే?

టీకా విషయమై గురువారం కేంద్ర హెల్త్ సెక్రెటరీ రాజేష్ భూషణ్ జైడస్‌ వ్యాక్సిన్‌ను అతిత్వరలో జాతీయ టీకా డ్రైవ్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. మూడు డోసుల టీకా కావడంతో ధర బిన్నంగా ఉంటుందని వివరించారు. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కాగా ఈ టీకా ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారంగా రూపొందించారు. కేంద్రానికి చెందిన బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) ‘మిషన్‌ కొవిడ్‌ సురక్ష’ కింద జైడస్‌ క్యాడిలాతో కలిసి టీకాను అభివృద్ధి చేసింది.

Janasena vs Posani: పోసాని ఇంటిపై రాళ్ళ దాడితో మాకు సంబంధం లేదు -తెలంగాణ జనసేన