Corona Cases : ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఈ రోజు ఎన్నంటే?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. ఏపీలో బుధవారం పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గాయి.

Corona Cases : ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఈ రోజు ఎన్నంటే?

Ap Corona

Corona Cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. ఏపీలో బుధవారం పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1010 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,50, 324 కి పెరిగింది. ఇక 13 మంది మరణించారు.

Read More : North Korea : ఉత్తర కొరియాలో కీలక మార్పులు..కిమ్ సోదరికి అధ్యక్ష బాధ్యతలు?

దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 14, 176 కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 58 , 054 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి వరకు 2, 82 , 93 , 704 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,503 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1149 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,24 , 645 లక్షలకు చేరింది.

Read More : Flipkart Deals: స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్.. రూ. 18వేలకే iPhone వచ్చేస్తుంది