పౌరసత్వ సవ రణం : భయం..భయంగా ఉంది జామియా స్టూడెంట్స్

తమకు ఇక్కడ భయం భయంగా ఉంది..ఇక్కడి నుంచి వెళ్లిపోతాం..పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొడుతున్నారంటూ..స్టూడెంట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై లాఠీఛార్జీ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం కరెక్టు కాదంటున్నారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు తమ తమ సొంత రాష్ట్రాలకు, గ్రామాలకు తరలివెళుతున్నారు.
కొద్ది రోజులుగా వర్సిటీలో యుద్ధ వాతావరణం నెలకొంది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ..విద్యార్థులు ఆందోళనలను నిర్వహిస్తున్నాయి. పోలీసులు, విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక మంది గాయపడ్డారు. గాయపడి విద్యార్థులను, పోలీసులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే..పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. క్యాంపస్‌కు దూరంగా నిరసనలు తెలియచేస్తున్నా..పోలీసులు లోనికి రావడంతో భయానక వాతావరణం నెలకొందని వెల్లడిస్తున్నారు.
అసలు వర్సిటీలోకి పోలీసులు ఎంట్రీకి పర్మిషన్ ఎవరిచ్చారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. పోలీసులే కావాలనే దాడులు చేస్తున్నారని, లైబ్రరీ హాల్‌లోకి వచ్చి టియర్ గ్యాస్ ప్రయోగించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వీసీ భిన్నంగా వ్యవహరిస్తున్నారని, పోలీసులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సంఘ విద్రోహశక్తులు లోనికి ప్రవేశించారని, శాంతిభద్రతలకు భంగం కలుగకుండా ఉండేందుకు తాము చర్యలు తీసుకోవాల్సి వస్తోందని పోలీసులు అంటున్నారు. మొత్తంగా వర్సిటీలో భయానక వాతావరణం నెలకొంది.
Read More : పౌరసత్వ సవరణ రణరంగం : హింస సరికాదు : కిషన్ రెడ్డి