Stalin
Stalin – Tamil Nadu: తమిళనాడు సీఎం స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన చెన్నై (Chennai) గ్రీమ్స్ రోడ్డులోని (Greams Road) అపోలో ఆసుపత్రి(Apollo Hospital)లో చేరారు. స్టాలిన్ జీర్ణకోశ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
ఆసుపత్రిలో స్టాలిన్ కు ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించారు. స్టాలిన్ సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారని అపోలో ఆసుపత్రి తెలిపింది. ఆయనను మంగళవారం డిశ్చార్జ్ చేస్తామని ఓ ప్రకటనలో వివరించింది.
ఆసుపత్రిలో చేరడానికి ముందు స్టాలిన్… ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఫోన్ చేసి మాట్లాడారు. అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన విషయంపై చర్చించారు. శరద్ పవార్ కు సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటు చేసి సీఎం ఏక్‌నాథ్ షిండే కేబినెట్లో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ చర్యలపై పలువురు ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
Manipur Violence: మణిపూర్ అల్లర్లతో అట్టుడికిపోవాల్సిందేనా.. సమస్యకు ముగింపు లేదా?