Delhi Electricity : కరెంటును తెలివిగా ఉపయోగించుకోండి..అసౌకర్యానికి చింతిస్తున్నాం

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

Delhi CM Writes Letter PM : కరెంటును తెలివిగా ఉపయోగించుకోండి..బాధ్యతయుతమైన పౌరుడిగా ఉండాలంటూ…టాటా పవర్ ఆర్మ్ టాటా పవర్ డిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ప్రజలకు సూచించింది. ఈ మేరకు SMS ద్వారా సమాచారం పంపారు. ఎందుకంటే విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని…మధ్యాహ్నం 02 గంటల నుంచి సాయంత్రం 06 గంటల వరకు విద్యుత్ సరఫరా క్లిష్ట స్థాయిలో ఉంటుందని తెలిపింది. విద్యుత్ ను తెలివిగా వినియోగించుకోవాలని, అసౌకర్యానికి చింతిస్తున్నామని టాటా పవర్ డీడీఎల్ మెసేజ్ చేసింది. ఉత్తర జనరేషన్ ప్లాంట్లలో బొగ్గు లభ్యత తక్కువగా ఉందని వెల్లడించింది.

Read More : Bhadrakali Temple : దక్షిణ భారత స్వర్ణదేవాలయం…వరంగల్ భద్రకాళీ ఆలయం

కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా బొగ్గు సరఫరా, గ్యాస్ సరఫరా తక్కువగా ఉండడమే కారణం. బొగ్గు సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అయితే..డిమాండ్ కు తగ్గట్టుగా బొగ్గు సరఫరా కావడం లేదు. ఈ క్రమంలో…సీఎం జగన్ సమస్యపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు.

Read More : MAA Elections: గెలిచిన.. గెలవకపోయినా..’మా’ క్యాంటీన్ పెడతా -జీవిత రాజశేఖర్

తాజాగా..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, విద్యుత్ కేంద్రాల్లో ఒకరోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వ ఉందని, తక్షణమే బొగ్గు, గ్యాస్ సరఫరా అందించాలని లేఖలో కోరారు. బహిరంగ మార్కెట్ లో యూనిట్ విద్యుత్ ధర రూ. 20 పెంచారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాన మంత్రికి లేఖ రాయడం జరిగిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు