కంప్యూటర్ బాబా.. దిగ్విజయ్ కోసం అల్గారిథమ్ పూజలు

బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రామమందిరాన్ని నిర్మించలేకపోయిందని కంప్యూటర్‌ బాబా అన్నారు. రామమందిరం లేకపోతే మోడీ లేనట్లేనని ఆయన అన్నారు.

కంప్యూటర్ బాబా.. దిగ్విజయ్ కోసం  అల్గారిథమ్ పూజలు

Updated On : May 7, 2019 / 10:31 AM IST

బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రామమందిరాన్ని నిర్మించలేకపోయిందని కంప్యూటర్‌ బాబా అన్నారు. రామమందిరం లేకపోతే మోడీ లేనట్లేనని ఆయన అన్నారు.

పార్టీలోని సీనియర్ నేతలు మోడీకి వ్యతిరేకంగా ప్రత్యర్థులు గెలవాలని పూజలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం హయాంలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా కొనసాగిన కంప్యూటర్‌ బాబా.. భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ కోసం హఠ్ యోగా నిర్వహించనున్నారు. భోపాల్‌లోని సైఫియా కాలేజ్‌ మైదానంలో వందలాది సన్యాసులతో ఆయన ఈ పూజలు జరిపించారు.

ఈ పూజల్లో దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొన్నారు. అదే నియోజకవర్గం నుంచి సాద్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ పోటీ చేస్తున్నారు. ఆమెపై దిగ్విజయ్ సింగ్ గెలవాలని 3 రోజుల పాటు 7 వేల మంది సాధువులతో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రామమందిరాన్ని నిర్మించలేకపోయిందని కంప్యూటర్‌ బాబా అన్నారు. రామమందిరం లేకపోతే మోడీ లేనట్లేనని ఆయన అన్నారు.

కేవలం వస్త్రధారణ కాషాయంలో ఉంటేనే ప్రజ్ఞా సింగ్‌ను సాధ్విగా పిలవడం సబబు కాదన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని, దాంతో పాటు ఓ హత్య కేసులోనూ నిందితురాలని కంప్యూటర్‌ బాబాగా పేరొందిన నామ్‌దేవ్‌ దాస్‌ త్యాగి ఆరోపించారు.