Lok Sabha elections-2024: ప్లీనరీ సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటిస్తాం: కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్ పూర్ లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్లీనరీ సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రకటించనుంది. 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్షాలను ఏకం చేయడంపై కూడా కాంగ్రెస్ పార్టీ వివరాలు తెలిపే అవకాశం ఉంది.

Lok Sabha elections-2024: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్ పూర్ లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్లీనరీ సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రకటించనుంది. 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్షాలను ఏకం చేయడంపై కూడా కాంగ్రెస్ పార్టీ వివరాలు తెలిపే అవకాశం ఉంది.

తాజాగా, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. ప్లీనరీలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు విపక్షాల ఐక్యతపై మార్గదర్శకాలు ఇస్తారని చెప్పారు. కాంగ్రెస్ లేకుండా విపక్షాల ఐక్యత సాధ్యం కాదని అన్నారు. దేశంలోని పలు రాజకీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువస్తుందని తెలిపారు.

తమ ప్రధాన ధ్యేయం బీజేపీని ఓడించడమేనని అన్నారు. దేశంలోని విపక్ష పార్టీల ఐక్యత చాలా ముఖ్యమని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చెప్పారు. తమ పార్టీ ప్లీనరీ సమావేశంలో దీనిపై చర్చిస్తామని తెలిపారు. విపక్షాలను కాంగ్రెస్ ముందుండి నడిపించాలన్న సందేశాన్ని తమకు ఎవ్వరూ ఇవ్వాల్సిన అవసరం లేదని, తమ పార్టీ లేనిదే విపక్షాల ఐక్యత సాధ్యపడదని చెప్పారు.

విపక్షాల ఐక్యత అంశాన్ని కాంగ్రెస్ ప్లీనరీలో చర్చించాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ జోడో యాత్ర విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

Viral Video: నిజమైన భార్యాభర్తల బంధం అంటే ఇదే.. వైరల్ అవుతున్న వృద్ధ దంపతుల వీడియో

ట్రెండింగ్ వార్తలు