Ghulam Nabi Azad: కాంగ్రెస్ నామీద మిసైల్స్ వేసింది, జస్ట్ రైఫిల్‭తో వాటిని ధ్వంసం చేశాను.. అదే నేను బాలిస్టిక్ మిసైల్ తీసుంటే?

కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరమే నిర్వహించిన సమావేశంలో ఆజాద్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‭కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తెచ్చేందుకు పోరాడతానని అన్నారు. ఇక తొందరలోనే తాను ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించిన ఆయన.. పార్టీ పేరును ప్రజలే నిర్ణయిస్తారని ప్రకటించారు. అయితే ప్రజలు నిర్ణయించిన పేరుల్లోంచి దేశ ప్రజలందరికీ అర్థమయ్యేలా హిందుస్తాని పేరును తీసుకుంటానని అన్నారు.

Congress Fired Missiles At Me Then I Destroyed Them With A Rifle Says Ghulam Nabi Azad

Ghulam Nabi Azad: రాజీనామా చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతున్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఈసారి విమర్శలకు ఆయుధాల్ని జత చేర్చారు. తన మాటల తూటాలకు కాంగ్రెస్ నేతల క్షిపణులు ధ్వంసమయ్యాయని చెప్పుకొచ్చారు. గురువారం జమ్మూ కశ్మీర్‭లోని భడేర్వాలో ఆజాద్ పర్యటించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘నా మీద వాళ్లు (కాంగ్రెస్ నేతలు) మిసైళ్లు విసిరారు. నేను కేవలం 303 రైఫిల్ మాత్రమే ఉపయోగించాను. వాళ్ల మిసైల్సన్నీ ధ్వంసమయ్యాయి. ఒకవేళ నేను బాలిస్టిక్ మిసైల్ ఉపయోగించి ఉంటే వారి పరిస్థితి ఏంటి? బహుశా ఎవరూ ఈపాటికి కనిపించకపోయి ఉండవచ్చు’’ అని అన్నారు.

TRS vs BJP: హైదరాబాద్ చేరుకున్న అనంతరమే కేసీఆర్‭పై విమర్శలు గుప్పించిన అస్సాం సీఎం

ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనకు మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే వారిపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. వారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన స్పందిస్తూ ‘‘నేను 52 ఏళ్లుగా పార్టీలో ఉన్నాను. రాజీవ్ గాంధీని నా సోదరుడిగా భావిస్తాను, ఇందిరా గాంధీని నా తల్లిగా భావిస్తాను. వారికి వ్యతిరేకంగా మాట్లాడలేను’’ అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరమే నిర్వహించిన సమావేశంలో ఆజాద్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‭కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తెచ్చేందుకు పోరాడతానని అన్నారు. ఇక తొందరలోనే తాను ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించిన ఆయన.. పార్టీ పేరును ప్రజలే నిర్ణయిస్తారని ప్రకటించారు. అయితే ప్రజలు నిర్ణయించిన పేరుల్లోంచి దేశ ప్రజలందరికీ అర్థమయ్యేలా హిందుస్తాని పేరును తీసుకుంటానని అన్నారు.

BJP: మాజీ సీఎంకు బ్రేక్ వేసిన అధిష్టానం.. హైకోర్టు విచారణ నేపథ్యంలో మారిన నిర్ణయాలు

ఆగస్టు 26న పార్టీలోని అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి ఆజాద్ లేఖ రాశారు. ఈ లేఖలో కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆజాద్ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాహుల్ వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ రాజకీయంగా ఎదగాలని, ఆయన అపరిపక్వత వల్ల పార్టీ చాలా నష్టపోతోందని ఆజాద్ విమర్శించారు.

Rahul Gandhi t-shirt: రాహుల్ గాంధీ టీ షర్ట్ ధరపై బీజేపీ రచ్చ.. మోదీ ధరించిన సూట్ ధర గురించి కూడా మాట్లాడదామంటూ కాంగ్రెస్ ఫైర్