Rahul Gandhi t-shirt: రాహుల్ గాంధీ టీ షర్ట్ ధరపై బీజేపీ రచ్చ.. మోదీ ధరించిన సూట్ ధర గురించి కూడా మాట్లాడదామంటూ కాంగ్రెస్ ఫైర్

‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ ధర విషయంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ నడుస్తోంది. మోదీ కూడా రూ.10 లక్షల ఖరీదైన సూటు ధరించారంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.

Rahul Gandhi t-shirt: రాహుల్ గాంధీ టీ షర్ట్ ధరపై బీజేపీ రచ్చ.. మోదీ ధరించిన సూట్ ధర గురించి కూడా మాట్లాడదామంటూ కాంగ్రెస్ ఫైర్

Updated On : September 9, 2022 / 4:39 PM IST

Rahul Gandhi t-shirt: ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ ధర విషయంలో బీజేపీ విమర్శలు చేస్తోంది. దీనికి కాంగ్రెస్ ధీటుగా బదులిస్తోంది. పాదయాత్రలో రాహుల్ గాంధీ తెలుపు రంగు టీ షర్ట్ ధరించి ఉన్నారు.

iPhone 14: అమెరికా నుంచి ఐఫోన్లు తెప్పించుకుందామనుకుంటున్నారా.. అయితే ఆగిపోండి.. ఎందుకంటే

బర్‌బెర్రీ బ్రాండ్‌కు చెందిన ఈ టీ షర్ట్ ధర రూ.41,000 అంటూ బీజేపీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘భారత్ దేఖో’ అంటూ.. రాహుల్ ఖరీదైన టీ షర్ట్ ధరించారని విమర్శించింది. ఈ మేరకు బీజేపీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ట్వీట్ చేసింది. అయితే, దీనికి కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. గతంలో ప్రధాని మోదీ రూ.10 లక్షల ఖరీదైన సూటు ధరించారంటూ వెల్లడించింది. ‘‘భారత్ జోడో యాత్ర సందర్భంగా వస్తున్న ప్రజా స్పందనను చూసి మీరు (బీజేపీ) భయపడుతున్నారా? సమస్యల గురించి మాట్లాడండి.

Neeraj Chopra: నీరజ్ చోప్రా మరో రికార్డు.. డైమండ్ ట్రోఫీ గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఘనత

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి. ఒకవేళ మనం బట్టల గురించే చర్చించాల్సి వస్తే మోదీ ధరించిన రూ.10 లక్షల సూటు, రూ.1.5 లక్షల కళ్లద్దాల గురించి కూడా మాట్లాడుకుందాం’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా, డ్రెస్సుల ఖరీదు విషయంలో రచ్చ నడుస్తోంది.