TRS vs BJP: హైదరాబాద్ చేరుకున్న అనంతరమే కేసీఆర్‭పై విమర్శలు గుప్పించిన అస్సాం సీఎం

‘‘బీజేపీలేని రాజకీయాలు కావాలని సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. కుటుంబం, వంశపారపర్యం లేని రాజకీయాలు కావాలని మేము మాట్లాడుతున్నాం. రెండింటికీ చాలా తేడా ఉంది. హైదరాబాద్‭లో ఎక్కడ చూసినా కేసీఆర్ కుమారుడు, కుమార్తె ఫొటోలే కనిపిస్తున్నాయి. ఒక్క తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా కుటుంబ రాజకీయాల పారంపర్యం కొనసాగుతోంది. వీటి నుంచి దేశాన్ని విముక్తం చేయాలి. అలా చేయగలిగేది బీజేపీ మాత్రమే’’ అని సీఎం హిమంత బిశ్వా శర్మ అన్నారు.

TRS vs BJP: హైదరాబాద్ చేరుకున్న అనంతరమే కేసీఆర్‭పై విమర్శలు గుప్పించిన అస్సాం సీఎం

We speak about dynasty free politics says Assam CM Himanta Biswa Sarma

TRS vs BJP: తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. జాతీయ స్థాయి నేతలు ఇక్కడికి వస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. కాగా, వచ్చిన అనంతరమే ముఖ్యమంత్రి కేసీఆర్‭పై విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని ఒకే కుటుంబం పాలిస్తోందని, ఈ పరిస్థితి నుంచి బీజేపీ విముక్తి కల్పిస్తుందని ఆయన అన్నారు.

‘‘బీజేపీలేని రాజకీయాలు కావాలని సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. కుటుంబం, వంశపారపర్యం లేని రాజకీయాలు కావాలని మేము మాట్లాడుతున్నాం. రెండింటికీ చాలా తేడా ఉంది. హైదరాబాద్‭లో ఎక్కడ చూసినా కేసీఆర్ కుమారుడు, కుమార్తె ఫొటోలే కనిపిస్తున్నాయి. ఒక్క తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా కుటుంబ రాజకీయాల పారంపర్యం కొనసాగుతోంది. వీటి నుంచి దేశాన్ని విముక్తం చేయాలి. అలా చేయగలిగేది బీజేపీ మాత్రమే’’ అని సీఎం హిమంత బిశ్వా శర్మ అన్నారు.

కాగా, ఈరోజు హైదరాబాద్‭లో నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవంలో సీఎం హిమంత బిశ్వా శర్మ పాల్గొననున్నారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం.. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి ట్యాంక్ బండ్ మీదకు వస్తారు. కాసేపు అక్కడే ఉండి గణేష్ నిమజ్జనాలను పర్యవేక్షిస్తారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన.. తిరిగి అస్సాం వెళ్లిపోనున్నారు.

BJP: మాజీ సీఎంకు బ్రేక్ వేసిన అధిష్టానం.. హైకోర్టు విచారణ నేపథ్యంలో మారిన నిర్ణయాలు