Drugs Case : డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్

డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని జలాలాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాత డ్రగ్స్ కేసులో కాంగగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు....

MLA Sukhpal Singh

Drugs Case : డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని జలాలాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాత డ్రగ్స్ కేసులో కాంగగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఎమ్మెల్యే సింగ్ ఇంటిపై దాడి చేసినపుడు ఆయన ఫేస్ బుక్ లైవ్ పెట్టారు. (Congress MLA Sukhpal Singh Khaira arrested) నార్కోటిక్ డ్రగ్స్ కేసులో చంఢీఘడ్ నగరంలోని సెక్టార్ 5 లో ఉన్న ఇంటిపై గురువారం తెల్లవారుజామున దాడి చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. (Punjab Police in drugs case)

Asian Games 2023 : పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం

ఎమ్మెల్యే సింగ్ అరెస్ట్ సందర్భంగా అతని కుటుంబసభ్యుడు వీడియో తీశారు. ఏ కేసులో అరెస్టు చేస్తున్నారు? వారెంటు ఉందా అని ఎమ్మెల్యే పోలీసులను ప్రశ్నించారు. నార్కొటిక్ కేసులో అరెస్టు చేస్తున్నట్లు జలాలాబాద్ డీఎస్పీ రాం శర్మ చెప్పారు. సుప్రీంకోర్టు క్వాష్ చేసిన కేసులో తనను అరెస్టు చేయడం రాజకీయ ప్రేరేపితమని ఎమ్మెల్యే సింగ్ ఆరోపించారు. అరెస్ట్ సందర్భంగా ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రజత పతకం…వుషులో రోషిబినా దేవి కైవసం

భోలాథ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సుఖ్ పాల్ సింగ్ ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు. 2015వ సంవత్సరంలో ఫాజిల్కా లో డ్రగ్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యేతో పాటు 9మంది నిందితులున్నారు. ఎమ్మెల్యే అరెస్టును కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా ఖండించారు. ప్రధాన సమస్యల నుంచి ప్రజలను మళ్లించడానికి పంజాబ్ ప్రభుత్వం చేసిన పన్నాగమని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ చెప్పారు.