Asian Games 2023 : పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం

ఆసియా క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ మొత్తం స్కోరు 1734 సాధించి స్వర్ణం సాధించింది....

Asian Games 2023 : పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం

Air Pistol Team

Updated On : September 28, 2023 / 9:01 AM IST

Asian Games 2023 : ఆసియా క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ మొత్తం స్కోరు 1734 సాధించి స్వర్ణం సాధించింది. భారత త్రయం సరబ్‌జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా ఒక్క పాయింట్ తేడాతో చైనాను ఓడించి స్వర్ణం సాధించారు. (Asian Games 2023 Shooting)

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రజత పతకం…వుషులో రోషిబినా దేవి కైవసం

ఎయిర్ పిస్టల్ టీమ్ అద్భుతమైన ఆటతీరుతో ఒక్కటి తేడాతో చైనాను ఓడించి జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. (India win gold) వియత్నాం పటిష్ఠ ప్రదర్శన చేసి మొత్తం 1730 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 580 పాయింట్లు సాధించిన సరబ్జోత్ సింగ్ వ్యక్తిగత ఈవెంట్‌లో 5వ స్థానం సాధించగా, అర్జున్ సింగ్ చీమా మొత్తం 578 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచారు. (Men’s 10m Air Pistol Team event)

Massive Traffic in Bengaluru : ఒక కిలోమీటర్ ప్రయాణానికి 2 గంటల సమయం…భారీ ట్రాఫిక్‌తో రాత్రికి ఇంటికి చేరిన పాఠశాల విద్యార్థులు

గురువారం ఉదయం అయిన వ్యక్తిగత ఫైనల్‌లో ఇద్దరూ కూడా తమ స్థానాలు పొందారు. శివ నర్వాల్ 576 స్కోరుతో జట్టు విజయానికి సహకరించి 14వ స్థానంలో నిలిచారు. మొత్తంమీద ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు.