Rajasthan: కాంగ్రెస్ అందుకే ‘జై శ్రీరాం’ అని చెప్పదు.. కాంగ్రెస్ ‘సియారాం’ నినాదంపై రాజస్థాన్ బీజేపీ చీఫ్ ఆగ్రహం

రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై పునియా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నేరాలు నిత్యకృత్యమయ్యాయని, దీనిపై గెహ్లాట్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా సెకండ్ గ్రేడ్ టీచర్ ఎగ్జాం పేపర్ లీకుపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి అక్రమాల్లో ఉన్నంత శ్రద్ధ ప్రజల అవసరాల్లో ఉండదని సతీష్ పునియా విమర్శించారు.

Congress most averse to Ram says Satish Poonia slams party over Gehlot remark

Rajasthan: కాంగ్రెస్ పార్టీకి రాముడంటే చాలా విరక్తంటూ ఆరోపణలు గుప్పించారు రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ చీఫ్ సతీష్ పునియా. రాముడిని సీతను బీజేపీ వేరు చేసి చూపిస్తోందంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం ఆయన స్పందిస్తూ పై విధంగా విమర్శించారు. హిందుత్వం మీద, రాముడి మీద కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఒక అభిప్రాయం అంటూ లేదని, వాస్తవానికి రాముడంటే కాంగ్రెస్ పార్టీకి విరక్తని ఆయన అన్నారు.

Twitter Data Breach: ప్రమాదంలో ట్విట్టర్ యూజర్లు.. అమ్మకానికి 40 కోట్ల మంది డేటా!

రామజన్మభూమి ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడాన్ని పునియా ప్రస్తావించారు. నిజానికి ఆ పార్టీకి రాముడి మీద భక్తి ఉంటే, రామజన్మభూమి ఆందోళనకు బేషరతు మద్దతు ఇచ్చేదని దుయ్యబట్టారు. ఇక ‘జై శ్రీరాం’ నినాదాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘జై సియారాం’ అనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జై శ్రీరాం’ అంటే తప్పేంటని, ఇది భారతీయ సనాతన ధర్మాన్ని సూచిస్తుందని, సనాతన ధర్మాన్ని పాటించని వారు ఆ నినాదాన్ని తిరగదోడాలని చూస్తున్నారని విమర్శించారు.

Bihar: లాలూ ప్రసాద్ యాదవ్‭ను మళ్లీ టార్గెట్ చేసిన సీబీఐ.. ఫిర్యాదులేమీ లేవని మూసేసిన పాత కేసు రీఓపెన్

ఇక రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై పునియా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నేరాలు నిత్యకృత్యమయ్యాయని, దీనిపై గెహ్లాట్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా సెకండ్ గ్రేడ్ టీచర్ ఎగ్జాం పేపర్ లీకుపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి అక్రమాల్లో ఉన్నంత శ్రద్ధ ప్రజల అవసరాల్లో ఉండదని సతీష్ పునియా విమర్శించారు.