Congress President Election: ఖర్గే వర్సెస్ శశి థరూర్.. నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి ఎన్నిక.. ఓటు వేసేది ఎంతమంది అంటే?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్‌లు పోటీ పడుతున్నారు. ఖర్గే వైపు అధిక మంది నేతలు మొగ్గుచూపుతున్నట్లు పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ.. థరూర్‌కు పార్టీలోని యువ నేతల నుండి మద్దతు ఉన్నందున ఖర్గేకు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు.

Congress President Election
Congress President Election: కాంగ్రెస్ పార్టీ 37వ అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు రంగం సిద్ధమైంది. సుమారు 9,300 మంది కాంగ్రెస్ ప్రతినిధులు సోమవారం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరికి ఓటు ద్వారా తమ మద్దతు తెలపనున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుంది. కానీ ఈ దఫా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష పదవికోసం ముందుకురాకపోవటంతో ఎన్నిక అనివార్యమైంది. 137ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఆరోసారి పోలింగ్ ప్రక్రియ ద్వారా అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.
Congress President Election: రేపే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక.. రాహుల్ ఓటు వేయబోయేది అక్కడ్నుంచే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ లు బరిలో నిలిచారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని పార్టీ కమిటీలతో వీరు భేటీ అయ్యి ఓటును అభ్యర్థించారు. పార్టీ బలోపేతానికి చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీల ప్రతినిధులకు వివరించారు. థరూర్ ప్రచారపర్వం ఆసక్తికరంగా సాగింది. మీడియాలో హైలెట్ అయ్యేలా థరూర్ తనదైన రీతిలో ప్రచారాన్ని కొనసాగించారు. అయితే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఖర్గే వైపే అధిక మంది మొగ్గు చూపుతున్నట్లు పార్టీలో ప్రచారంజరుగుతుంది.
ఓటింగ్ ప్రక్రియ అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయాల్లో జరుగుతుంది. జాతీయ స్థాయిలో అక్బర్ రోడ్‌లోని AICC ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. ఈ ఎన్నికలో మొత్తం సుమారు 9,300 మంది ప్రతినిధులు ఓటువేసే అవకాశం ఉంది. ఇందుకోసం 65 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఓటుహక్కును వినియోగించుకుంటారు. ప్రస్తుతం రాహుల్ భారత్ జోడో పాదయాత్రలో ఉన్న కారణంగా.. అక్కడే ప్రత్యేక పోలింగ్ బూత్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. రాహుల్ తో పాటు మరో 41 మంది ప్రతినిధులు అక్కడి నుంచే ఓటు వేయనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా, ప్రియాంక ఓటు వేయనున్నారు. అయితే, థరూర్‌కు పార్టీలోని యువకుల నుండి మద్దతు ఉన్నందున ఖర్గేకు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికలకు సంబంధించి బుధవారం (19న) ఫలితాలు వెల్లడవుతాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
2000లో చివరిసారిగా సోనియా గాంధీ, జితేంద్ర ప్రసాద్ మధ్య ఎన్నికలు జరిగాయి. 7,700 ఓట్లలో సోనియాకు 7,448 రాగా, ప్రసాద్‌కు 94 మాత్రమే వచ్చాయి. మిగిలిన ఓట్లు చెల్లలేదు. చివరి గాంధీయేతర కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేస్రీ. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుల్లో సోనియా 22సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పనిచేశారు. ఇందిరా గాంధీ ఏడేళ్లు, జవహర్‌లాల్ నెహ్రూ ఎనిమిదేళ్లు పార్టీకి నాయకత్వం వహించారు.