Cooking Oils : మరింత తగ్గనున్న వంటనూనె ధరలు

వంటనూనె ధరలు మరింత తగ్గనున్నాయి. దీనికి కేంద్రం తీసుకున్న నిర్ణయమే కారణం. శుద్ధి చేసిన పామాయిల్‌ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించింది కేంద్రం.

Cooking Olis : వంటనూనె ధరలు మరింత తగ్గనున్నాయి. దీనికి కేంద్రం తీసుకున్న నిర్ణయమే కారణం. శుద్ధి చేసిన పామాయిల్‌ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించింది కేంద్రం. దీంతో పామాయిల్ ధరలు తగ్గనున్నాయి. ట్రేడర్లు లైసెన్స్ లేకుండానే పామాయిల్ దిగుమతి చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఆర్‌బీడీ పామాయిల్, ఆర్‌బీడీ పామోలిన్ వంటి వాటిని లైనెన్స్ లేకుండానే దిగుమతి చేసుకోవచ్చంది. సవరించిన ఈ బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ (BCD) మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు అమల్లో ఉంటుంది. డిసెంబర్ 2022 వరకు లైసెన్స్ లేకుండా రిఫైన్డ్‌ పామాయిల్‌ను దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులకు అనుమతి ఉంటుంది.

Hairfall: తక్కువ వయస్సులోనే జుట్టు ఊడిపోవడానికి కారణాలు

నవంబర్ 2020 అక్టోబర్ 2021 మధ్య కాలంలో రూ.1.17 లక్షల కోట్ల విలువైన వంట నూనెను దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు పామాయిల్ విషయంలో దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలు అదుపులో పెట్టడంతో పాటు.. రైతులకు చేయూత ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల 40 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది.

ముడి పామాయిల్, పలు ఇతర వ్యవసాయ వస్తువుల కొత్త డెరివేటివ్ ఒప్పందాలపై కేంద్రం నిషేధం విధించింది. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. అంతకు ముందు జూన్‌లో నూనె ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు రిఫైర్డ్‌ పామాయిల్‌ దిగుమతిపై కేంద్రం నిషేధం విధించింది.

Vitamin Pills : విటమిన్ మాత్రలు ఎవరికి అవసరమో తెలుసా?

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. సోమవారం రిటైల్‌ మార్కెట్లో నూనెల ధరలు(కిలో) ఈ విధంగా ఉన్నాయి.
* వేరు శెనగ నూనె రూ.181.48
* ఆవనూనె రూ.187.43
* వనస్పతి రూ.138.5
* సోయాబీన్ ఆయిల్ రూ.150.78
* పొద్దుతిరుగుడు నూనె రూ. 163.18
* పామాయిల్ రూ.129.94గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు