భౌతికదూరం పాటించమన్నారని పోలీసులపై దాడి

ఒకే చోట భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడవద్దని చెప్పిన పోలీసులపై కొందరు విచక్షణారహితంగా దాడికి దిగారు.

Sangamner ఒకే చోట భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడవద్దని చెప్పిన పోలీసులపై కొందరు విచక్షణారహితంగా దాడికి దిగారు. పోలీసులను వెంబడించి మరీ వారిపై దాడి చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​ జిల్లా సంగమ్నేర్​లో గురువారం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిపై స్థానిక డిప్యూటీ ఎస్పీ రాహుల్ మడనే మాట్లాడుతూ..గురువారం మా పోలీస్ ఇన్స్పెక్టర్,స్టేట్ రిజర్వ్ పోలీస్,హోం గార్డు సంగమ్నేర్​ ఏరియాలో పాట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున కొంతమంది ఒకచోట గుమిగూడి ఉండటాన్ని వారు గమనించారు. రాష్ట్రంలో కోవిడ్-19 ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోట గుమిగూడి ఉండటాన్ని గమనించిన పోలీసులు..ఒకో చోట ఇంతమంది ఉండకూడదని వారికి చెప్పేందుకు అక్కడికి వెళ్లారు. దీంతో భౌతికదూరం పాటించాలని చెప్పిన పోలీసులను వెంటబడి మారీ వారిపై దాడికి పాల్పడ్డారు కొందరు. అక్కడున్న సీసీ ఫుటేజీ ని పరిశీలించామని, ఈ ఘటనకు సంబంధించి అనేక మందిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసినట్లు రాహుల్ మడనే తెలిపారు. వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు.

అంతకుముందు బుధవారం, మహారాష్ట్ర ఇన్‌ఛార్జి డీజీపీ సంజయ్ పాండే… రాష్ట్రంలో కోవిడ్ -19 వ్యాప్తిని నిలువరించేందుకు అమలు చేయబడిన లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేయడానికి పౌరుల సహకారం కోరిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు