Omicron Variant : ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తొలి భారతీయుడు

దేశంలో కరోనా కేసుల సంఖ్య గత రెండు రోజులుగా పెరుగుతూ వెళ్తుంది. గడిచిన 24 గంటల్లో 9419 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,66,241కి చేరింది.

Omicron Variant : ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తొలి భారతీయుడు

Corona Cases (2)

Updated On : December 9, 2021 / 11:40 AM IST

Omicron Variant : దేశంలో కరోనా కేసుల సంఖ్య గత రెండు రోజులుగా పెరుగుతూ వెళ్తుంది. గడిచిన 24 గంటల్లో 9419 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,66,241కి చేరింది. ఇందులో 3,40,97,388 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. 4,74,111 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా, గత 24 గంటల్లో 8251 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారని, మరో 159 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

చదవండి : Telangana Corona : తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే

ఇక కరోనా వ్యాక్సినేషన్ 130 కోట్లకు చేరింది. డిసెంబర్ నాటికీ దేశంలోని ప్రజలందరినీ మొదటిడొసు టీకా పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే ఈ నెల చివరికి మొదటి డోసు టీకా పంపిణి పూర్తయ్యేలా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా 1,30,39,32,286 కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది. మొత్తం కేసుల్లో 0.2 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.36 శాతం ఉందని పేర్కొన్నది.

చదవండి : Corona Cases : దేశంలో పెరిగిన కరోనా కేసులు.. వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24గా ఉంది. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయిన తొలి వ్యక్తి కోలుకున్నాడు. ఆయనకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఆ వ్యక్తిని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు తెలిపారు.