Corona Covaxin : చిన్నారుల కోసం కొవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది!

రెండు సంవత్సరాల నుంచి 18 ఏళ్ల వారికి కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డీసీజీఐ (DCGI) నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Corona Covaxin : చిన్నారుల కోసం కొవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది!

Covaxin For Kids

Updated On : October 12, 2021 / 2:05 PM IST

Covaxin For Kids : భారత్ లో కరోనా క్రమక్రమంగా తగ్గముఖం పడుతోంది. వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను జోరుగా కొనసాగుతోంది. పెద్దవారికి మాత్రమే ఈ వ్యాక్సినేషన్ ఉండడంతో చిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితిపై భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికీ వ్యాక్సిన్ ఏదీ అందుబాటులోకి రాకపోవడంతో అందరినీ కలవరపెట్టింది. టీకా తీసుకోకపోవడం..కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై అధిక ప్రభావం చూపెడుతుందని నిపుణుల హెచ్చరికలతో తల్లిదండ్రులు తీవ్రంగా భయపడిపోయారు. వారికి కూడా వ్యాక్సినేషన్ ఇప్పించేలా ఏర్పాట్లు చేయాలని పలువురు సూచిస్తున్నారు. ఇందుకనుగుణంగా…పలు కంపెనీలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి.

Read More : Terrorist Arrest : ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. పాకిస్తాన్ టెర్రరిస్టు అరెస్టు

తాజాగా…చిన్నారులకు టీకా అందుబాటులోకి రానుంది. రెండు సంవత్సరాల నుంచి 18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డీసీజీఐ (DCGI) నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతినిచ్చింది. భారత్ బయోటెక్ పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరిపింది. మూడు వర్గాలుగా విభజించింది. తొలుత 2 నుంచి 6, రెండో దశ 6 నుంచి 12, మూడో దశ 12 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలపై ఈ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. పెద్దల్లో వచ్చిన ట్రయల్స్ ఫలితాలే…చిన్నారుల్లో కూడా వచ్చినట్లు ప్రాథమికంగా వెల్లడైంది.

Read More : Martina Navratilova: మోడీపై అమిత్ షా ప్రశంసలు..అదో జోక్ అంటూ టెన్నిజ్ లెజెండ్ సెటైర్

మొదటగా 12 నుంచి 18 ఏళ్ల వయస్సు పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో భారత్ బయోటెక్ ఈ ట్రయల్స్ పూర్తి చేసింది. రెండు, మూడో దశ ట్రయల్స్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందచేసింది. 2, 3 దశల్లో రెండు డోసుల వ్యాక్సిన్ ను 525 మంది చిన్నారులపై ప్రయోగించారు. ఆరోగ్య సమస్యలున్న చిన్నారులకు ముందుగా అవకాశం ఇవ్వనున్నారు. 20 రోజుల వ్యవధిలో రెండు డోస్ లు ఇవ్వనున్నారు. మొత్తంగా.. ప్రపంచంలో పసిపిల్లలకు తొలి టీకా అందుబాటులోకి వచ్చిందని చెప్పవచ్చు.