Corona Effect : ఐదు రోజుల పాటు లాక్ డౌన్..బయటకు వస్తే అంతే సంగతులు

బళ్లారీలో కూడా 2021, మే 19వ తేదీ బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. జిల్లా యంత్రాంగం ఐదు రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌కు ఆదేశాలను జారీ చేసింది.

Lockdown : భారతదేశంలో కరోనా కొద్దికొద్దిగా అదుపులోకి వస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు సంపూర్ణంగా లాక్ డౌన్ విధించాయి. అత్యవసరం మినహా..ఏ కారణం లేకుండా..రోడ్లపైకి వస్తే..తాట తీస్తున్నారు పోలీసులు. బళ్లారీలో కూడా 2021, మే 19వ తేదీ బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది.

జిల్లా యంత్రాంగం ఐదు రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌కు ఆదేశాలను జారీ చేసింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే మాత్రమే ప్రజలను బయటకు అనుమతినిస్తారు. అనంతరం లాక్ డౌన్ కొనసాగనుంది. అత్యవసర సేవలు మినహా మెడికల్‌ స్టోర్స్, ఆస్పత్రులకు, పాల విక్రయాలకు మినహాయింపు ఇచ్చి మిగిలిన అన్ని దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

అనవసరంగా ఎవరైనా బయటకు వస్తే వాహనాలను సీజ్‌ చేస్తామని ఎస్‌పీ సైదులు అడావత్‌ హెచ్చరించారు. ఇప్పటి వరకు 600 వాహనాలను సీజ్‌ చేశామని, వారిపై కేసులు కూడా నమోదు చేసి జైలుకు పంపామన్నారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని, కోవిడ్ వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతివ్వాలని కోరారు.

Read More : Telangana : తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్‌లు

ట్రెండింగ్ వార్తలు