Telangana : తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్‌లు

Telangana : తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్‌లు

Telangana

Vaccination : తెలంగాణలో వరుసగా ఐదో రోజు..టీకా కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోస్ లు 1,28,550 డోసులున్నాయి. ఏప్రిల్ 01వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు టీకా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే..చాల మంది ఏప్రిల్ 10వ తేదీ..ఫస్ట్ డోస్ టీకా తీసుకున్నారు. ఇటీవలే సెకండ్ డోస్ టీకా వ్యవధి..పెంచడంతో వీరిలో..90 శాత మందికి..జూన్ నెలలో స్లాట్ వస్తుంది.

పోనీ..ఫస్ట్ డోస్ టీకా ఇద్దామని అనుకుంటే..అనుకుంటే..అందుబాటులో ఉన్న 1,28,550 ఏ మూలకు సరిపోవు. దీంతో మొదటి డోస్ ఇవ్వలేక, రెండో డోస్ కు అర్హులు నామమాత్రంగా మారడంతో..వ్యాక్సినేషన్ ను నిలిపివేసింది తెలంగాణ ఆరోగ్య శాఖ. మరోవైపు కోవాగ్జిన్ 58 వేల 230 డోసులున్నాయి. రెండు డోస్ ల మధ్య..వ్యవధి కేవలం నాలుగు వారాలు మాత్రమే. దీంతో చాలా మంది కోవాగ్జిన్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే..రెండో డోస్ కు డిమాండ్ కు తగ్గట్టు..కోవాగ్జిన్ నిల్వలు లేవు. దీంతో ఈ టీకా వచ్చే పరిస్థితి లేదు. వ్యాక్సిన్ డోసుల పంపిణీపై..కేంద్రం నుంచి క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం కేంద్రం వద్ద..లక్ష డోసుల టీకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిని కూడా కేవలం మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు కేటాయించారు.

మరో మూడు రోజులు తెలంగాణకు టీకాలు కేటాయించే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వారం రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నాయి ప్రభుత్వ వైద్య వర్గాలు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందే వ్యాక్సినేషన్ కోటాను బట్టి..టీకాలు వేసే ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో త్వరలోనే చెబుతామని అంటోంది ఆరోగ్య శాఖ.

Read More : Modi : తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటన