కరోనా రహిత రైల్వే కోచ్ లు

  • Publish Date - July 15, 2020 / 01:05 AM IST

కరోనా నేపథ్యంలో రైల్వే కోచ్‌లను పూర్తిగా మార్చివేస్తున్నారు. కరోనా తర్వాత వాడబోయే కొత్తరకం కోచ్‌లను రైల్వే విభాగం మంగళవారం (జులై 14, 2020) ప్రారంభించింది. కపుర్తల రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీలో తయారైన రెండు నమూనా కోచ్‌లను ప్రదర్శించింది. డోర్‌ హ్యాండిల్‌ నుంచి సోప్‌ డిస్పెన్సర్‌ వరకు ఇందులో అన్నీ ప్రత్యేకతలే ఉన్నాయి.

కరోనాను నిర్మూలించేందుకు కోచ్‌లకు టైటానియం డై ఆక్సైడ్‌ కోటింగ్‌ వేశారు. ఏసీ కోచ్‌లలో గాలిని ఎప్పటికప్పుడు శుద్దిచేసే వ్యవస్థను అమర్చారు. ఈ మార్పులు చేసేందుకు ఒక్కో బోగికి రూ.6-7 లక్షల వరకు ఖర్చు అయ్యిందని రైల్వేబోర్డు ప్రతినిధి తెలిపారు.