కరోనా రూ.20లే రండి బాబూ..రండి!! వైరల్ వీడియో

కరోనా.. ఈ మాట వింటే చాలు గుండె దడ పెరిగిపోతుంది.బీపీ సర్ మంటూ పైకి పాకుతుంది. కాసేపు మాటా మంతీ మిడిగుడ్సుకుని చూడాల్సి వస్తోంది. అదీ కరోనా అంటే అనేలా ఉంది ఇప్పుడు ప్రపంచ దేశాల పరిస్థితి. ఎవరి నోట విన్నా అనే మాట. ఎవరి మొహం చూసినా కరోనా జాగ్రత్తల కోసం మాస్కులే. ఇటువంటి సమయంలో మనం దారి వెంటే వెళ్తున్నప్పుడు..‘‘కరోనా.. కరోనా..’’అని ఎవరైనా అరిస్తే ఎలా ఉంటుంది? గుండె జారిపోతుంది.
అలా అరుస్తున్న ఓ వ్యక్తిని చూసి ఆగి మరీ చూస్తున్నారు ఆ దారి వెంట వెళ్లేవారంతా..రోగాన్ని కూడా వ్యాపారంగా మార్చేసుకోవటం ట్రెండ్ గా మారిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యాపారి ‘‘కరోనా రూ.20 మాత్రమే. రండి బాబు రండి’’ అని అరుస్తుంటే అటుగా వెళ్లే ప్రజలు ఉలిక్కిపడ్డారు.
ఏంటాని దగ్గరకు వెళ్లి చూస్తే.. అతడు చేతిలో మాస్కులు పట్టుకుని నిలుచున్నాడు. మాస్కు రూ.20లే బాబూ రండి రండి అని అరుస్తున్నాడు. అతడు కరోనా రూ.20 అంటున్నాడని తెలిసి నవ్వుకున్నారు. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Corona for sale .. 20 rs Only pic.twitter.com/08vlc64xd4
— Bhalla ? (@iam_tweetist) March 10, 2020
కాగా..ప్రపంచ వ్యాప్తంగా 5,417కు కరోనా మృతుల సంఖ్య చేరింది. లక్షా 45 వేల 413 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 116 మందికి సీరియస్ గా ఉంది. కరోనా వైరస్ 139 దేశాలకు పాకింది. ఇటలీలో కరోనా మృత్యుఘోష ఆగడం లేదు..అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది.
See Also | తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు..మరో ఇద్దరిలో వైరస్ లక్షణాలు