జాగ్రత్త సుమా : 60 ఏళ్లు దాటిన వారికి

ప్రపంచాన్ని కరోనా భూతం వీడడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ కనిపించని పురుగు..ప్రపంచ దేశాలను చుట్టివేసింది. లక్షల సంఖ్యలో బలయ్యారు. భారతదేశంలోకి ప్రవేశించిన ఈ రాకాసి..వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు చనిపోయారు.
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను 2020, మే 03వ తేదీ వరకు పొడిగించింది. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రకటించారు. వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మోడీ సూచించారు. ఈ క్రమంలో కేంద్ర సామాజిక, న్యాయసేవా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
దీర్ఘకాలిక బబ్బులున్న వారు ఇంటి నుంచి బయటకు రావొద్దు.
60 ఏళ్ల వయస్సు దాటి శ్వాసకోశ, కిడ్నీ, గుండె జబ్బులు, మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్ తో బాధ పడుతున్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
సోషల్ డిస్టెన్స్ పాటించాలి. రోజు యోగాతో పాటు వ్యాయామం చేయాలి.
ప్రతి రోజు వేడి వేడి ఆహారం తీసుకోవాలి. అందులో పోషకాలు ఉండాలి.
వ్యక్తిగత శుభ్రత తప్పకుండా పాటించాలి.
ఎవరితోనూ కరచాలనం చేయకుండా ఉండాలి
జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు.
ఉత్కంఠ కలిగించే, హర్రర్ సినిమాలు చూడవద్దు.
పొగాకు, మద్యం సేవించే అలవాటు ఉంటే తక్షణమే మానేయాలి.
దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
నీళ్లు తరచూ తాగుతుండాలి. ఏదైనా సమస్యలు (మానసికం) ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ( 08046110007) ఫోన్ చేయాలి.
Also Read | నేడే విడుదల : కేంద్రం మార్గదర్శకాలు..మద్యం విక్రయాలకు సడలింపు ?