Coronavirus India: బలహీనపడుతోన్న కరోనా సెకండ్ వేవ్.. 10శాతం కేసులు తగ్గాయి
దేశంలో హడలెత్తించిన కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పడుతుంది. దేశంలో వరుసగా నాలుగో రోజూ కరోనా కేసులు 10శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 52వేల 644 కొత్త కేసులు మాత్రమే దేశంలో నమోదయ్యాయి.

Coronavirus India
Coronavirus India Update: దేశంలో హడలెత్తించిన కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పడుతుంది. దేశంలో వరుసగా నాలుగో రోజూ కరోనా కేసులు 10శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 52వేల 644 కొత్త కేసులు మాత్రమే దేశంలో నమోదయ్యాయి.
అయితే మరణాలు మాత్రం ఎక్కువగానే నమోదవుతూ ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 3వేల 128 మంది చనిపోగా.. యాక్టివ్ కేసులు 20 లక్షల 26వేలకు తగ్గాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,80,47,534కి చేరుకుంది.
దేశ వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,56,92,342కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,29,100కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 21,31,54,129కు చేరుకున్నట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వేగంగా బలహీనపడుతోంది. కొత్త కేసులు నిరంతరం తగ్గుతుండగా.. లాక్‌డౌన్ ఉపశమనం దిశగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. దేశంలో రికవరీరేటు 91.25 శాతానికి పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.