కరోనా అప్‌డేట్: దేశంలో వరుసగా 4వ రోజు 18 వేలకు పైగా కేసులు.. రాష్ట్రాలవారీగా లెక్కలు

గత నాలుగు రోజులుగా దేశంలో 18 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. భారతదేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పటికే ఐదున్నర లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 5 లక్షల 66 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 16893 మంది మరణించగా, మూడు లక్షల 34 వేల మంది కూడా కోలుకున్నారు. గత 24 గంటల్లో 18 వేల 522మందికి కొత్తగా కరోనా వైరస్ సోకగా.. ఇదే సమయంలో 418మంది చనిపోయారు.
కరోనా సోకిన వారి సంఖ్య ప్రకారం భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశాలలో నాలుగవది. అమెరికా, బ్రెజిల్, రష్యా తరువాత, కరోనా మహమ్మారి ఎక్కువగా ప్రభావితమైన దేశాలలో భారత్ ఉంది. భారతదేశం కంటే ఎక్కువ కేసులు అమెరికా (2,637,039), బ్రెజిల్ (1,345,254), రష్యా (634,437). కానీ భారతదేశంలో కేసులు పెరిగే వేగం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత, భారతదేశంలో ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
కరోనా రికవరీ రేటు 58.67%:
దేశంలో కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశం అయినప్పటికీ, రోగుల రికవరీ రేటు నిరంతరం మెరుగుపడుతోంది. ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం. కరోనా రోగుల రికవరీ రేటు 58.67% కి చేరుకుంది. కరోనాను పరీక్షించడానికి క్లినికల్ లాబొరేటరీల నెట్‌వర్క్ పెరుగుతున్నందున, భారతదేశంలో ప్రయోగశాలల సంఖ్య ఇప్పుడు 1,047కు పెరిగింది. ఇందులో 760 ప్రభుత్వ, 287 ప్రైవేట్ ప్రయోగశాలలు ఉన్నాయి. జూన్ 28 వరకు 83,98,362 మందిని పరీక్షించగా, వారిలో 170,560 మందిని ఆదివారం పరీక్షించారు.
రాష్ట్రాలవారీగా లెక్కలు:
క్రమ సంఖ్య | రాష్ట్ర పేరు | మొత్తం కరోనా కేసులు |
కోలుకున్నవారు | చనిపోయినవారు |
---|---|---|---|---|
1 | అండమాన్ నికోబార్ | 90 | 46 | 0 |
2 | ఆంధ్రప్రదేశ్ | 13891 | 6232 | 180 |
3 | అరుణాచల్ ప్రదేశ్ | 187 | 61 | 1 |
4 | అస్సాం | 7752 | 5333 | 11 |
5 | బీహార్ | 9640 | 7390 | 62 |
6 | చండీగఢ్ | 435 | 349 | 6 |
7 | ఛత్తీస్గఢ్ | 2761 | 2173 | 13 |
8 | ఢిల్లీ | 85161 | 56235 | 2680 |
9 | గోవా | 1198 | 478 | 3 |
10 | గుజరాత్ | 31938 | 23240 | 1827 |
11 | హర్యానా | 14210 | 9502 | 232 |
12 | హిమాచల్ ప్రదేశ్ | 942 | 556 | 9 |
13 | జమ్మూ కాశ్మీర్ | 7237 | 4585 | 95 |
14 | జార్ఖండ్ | 2426 | 1845 | 15 |
15 | కర్ణాటక | 14295 | 7683 | 226 |
16 | కేరళ | 4189 | 2152 | 22 |
17 | లడఖ్ | 964 | 616 | 1 |
18 | మధ్యప్రదేశ్ | 13370 | 10199 | 564 |
19 | మహారాష్ట్ర | 169883 | 88960 | 7610 |
20 | మణిపూర్ | 1227 | 494 | 0 |
21 | మేఘాలయ | 47 | 42 | 1 |
22 | మిజోరం | 148 | 55 | 0 |
23 | ఒడిషా | 6859 | 4946 | 23 |
24 | పుదుచ్చేరి | 619 | 221 | 10 |
25 | పంజాబ్ | 5418 | 3764 | 138 |
26 | రాజస్థాన్ | 17660 | 13618 | 405 |
27 | తమిళనాడు | 86224 | 47749 | 1141 |
28 | తెలంగాణ | 15394 | 5582 | 253 |
29 | త్రిపుర | 1380 | 1085 | 1 |
30 | ఉత్తరాఖండ్ | 2831 | 2111 | 39 |
31 | ఉత్తర ప్రదేశ్ | 22828 | 15506 | 672 |
32 | పశ్చిమ బెంగాల్ | 17907 | 11719 | 653 |
భారతదేశంలో మొత్తం రోగుల సంఖ్య | 566840 | 334822 | 16893 |
Read:చైనా దూకుడు.. కరోనాపై యుద్ధం.. జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న మోడీ