భారత్ లో ఇవాళ(మార్చి-17,2020)కరోనా సోకి ఓ వ్యక్తి మరణించాడు. కరోనాసోకి ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. భారత్‌లో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 3కి చేరింది. గతవారంలో కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు,ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే.
చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 39 కేసులు నమోదు అయ్యాయి. విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 7వేలు దాటింది. మరో లక్షా 80వేల మంది ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనా తర్వాత స్థానంలో ఇటలీ,ఇరాన్,స్పెయిన్ దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
Also Read | తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న తనయుడు, నిజామాబాద్ బీజేపీలో రివెంజ్ పాలిటిక్స్