తెలంగాణలో లాక్‌డౌన్: జంతువులకు ఫ్రీడం.. వీధుల్లోకి ఎలుగుబంటి

తెలంగాణలోని కొమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా బయటతిరగటం మానేశారు. ఎవ్వరూ బయటికి రాకపోవడంతో జనసంచారం తగ్గి అడవిలో నుంచి ఒక ఎలుగుబంటి బయటకు వచ్చి ప్రశాంతంగా ఖాళీ వీధుల్లో తిరుగుతోంది. దాన్ని చూడగానే ప్రజలంతా వణికిపోయారు. వెంటనే అక్కడక్కడ తిరుగుతున్న వారు కూడా ఇళ్లలోకి వెళ్లిపోయారు.
అనంతరం అక్కడి ప్రజలు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేసి విషాయాన్ని తెలియజేశారు. ఫారెస్ట్ అధికారులకు అక్కడికి వచ్చారు. కానీ, అది వారికి కనిపించలేదు. దీంతో అది తిరిగి అడవిలోకి వెళ్లిపోయి ఉంటుందని ఆఫీసర్లు తెలియజేశారు. ప్రజలు మాత్రం అది కాలనీలోనే ఉందేమో అనే భయంతో వణికిపోతున్నారు.
ఇక ప్రభుత్వం చెప్పిన విధంగా లాక్‌డౌన్ నిబంధనలు ఎవ్వరు పాటించట్లేదు. కానీ, ఇప్పుడు ఈ ఎలుగుబంటి వల్ల లాక్‌డౌన్ నిబంధనలు బాగా అమలవున్నాయి. దానికి బయపడి ఒక్కరు కూడా ఇళ్లలోంచీ బయటకి రావట్లేదు.
See Also | కరీంనగర్‌లో రెడ్ అలర్ట్ , కరోనా పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం కేసిఆర్