Delhi Kejriwal : దేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా
ఎన్నికల్లో తమను ఓడించలేక కేజ్రీవాల్ ను చంపాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. మరోవైపు.. కేజ్రీవాల్ నివాసంపై జరిగిన దాడిని ఆప్ పార్టీ తీవ్రంగా పరిగణించింది...

Delhi CM
Delhi CM : దేశంలో అతిపెద్ద పార్టీనే దాదాగిరికీ పాల్పడుతోందని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకొంటోందని ఆయన సూటిగా ప్రశ్నించారు. బీజేపీ పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ఫైల్స్ పై రాష్ట్ర అసెంబ్లీలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ… బీజేపీ నేతలు ఆయన నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు.
హిందువులు కించపరిచేలా మాట్లాడిన కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలంటూ.. ఆయన నివాసంలోని పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనను సీఎం కేజ్రీవాల్ ఖండించారు. ఈ దేశం కోసం తాను చావడనికైనా సిద్ధమని, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యం కాకపోవచ్చు.. కానీ దేశం ముఖ్యమన్నారు. ఇలాంటి దౌర్జన్యాలతో భారత్ అభివృద్ధి చెందుతుందా ? అని ప్రశ్నించారు. ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని బీజేపీ తీసుకెళుతోందని, ఏదైనా సమస్యను పరిష్కరించడానికి దౌర్జన్యమే సరైన మార్గమమని ప్రజలు భావిస్తారన్నారు.
Read More : Arvind Kejriwal: ‘కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకే ఈ దాడి జరిగింది’
ఎన్నికల్లో తమను ఓడించలేక కేజ్రీవాల్ ను చంపాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. మరోవైపు.. కేజ్రీవాల్ నివాసంపై జరిగిన దాడిని ఆప్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ పిటిషన్ దాఖలు చేశారు. దాడి ఘటనలో మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.