Mahanadi: గొడవపడి మహానదిలో దూకిన దంపతులు

భార్యాభర్తలు గొడవపడి ఒడిసాలోని కటక్‌ ప్రాంతంలోని జోబ్రా తీరంలో మహానదిలో దూకేశారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Mahanadi: గొడవపడి మహానదిలో దూకిన దంపతులు

Mahanadi

Updated On : June 5, 2021 / 1:07 PM IST

Mahanadi: భార్యాభర్తలు గొడవపడి ఒడిసాలోని కటక్‌ ప్రాంతంలోని జోబ్రా తీరంలో మహానదిలో దూకేశారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందితో కలిసి నదివద్దకు చేరుకున్న పోలీసులు భార్యాభర్తలను బయటకు తీశారు. అనంతరం వారిని స్థానిక ఎస్సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు.

 

Couple Jumps Into Mahanadi River After In Cuttuck - Sakshi

 

అనంతరం వారిని స్థానిక ఎస్సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా తొలుత భార్య నదిలో దూకగా ఆమెను కాపాడేందుకు భర్త కూడా దూకాడు. నదిలో దూకడానికి ముందు దంపతులు గొడవ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.