శుభలేఖ రాశాను: మోడీకి ఓటేయండి.. గెస్టుల గిఫ్ట్!

గుజరాత్ కుటుంబానికి చెందిన ఓ కొత్త జంట వినూత్నంగా ఆలోచించింది. ఆ వధువరులే దావల్, జయ. ఎన్నడూ చూడని రీతిలో తమ వివాహా వెడ్డింగ్ కార్డులను ప్రింట్ చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ అది ఎలాగానుకుంటున్నారూ.. మీరు ఎంతమాత్రం ఊహించలేరంతే.

  • Published By: sreehari ,Published On : January 5, 2019 / 05:06 AM IST
శుభలేఖ రాశాను: మోడీకి ఓటేయండి.. గెస్టుల గిఫ్ట్!

గుజరాత్ కుటుంబానికి చెందిన ఓ కొత్త జంట వినూత్నంగా ఆలోచించింది. ఆ వధువరులే దావల్, జయ. ఎన్నడూ చూడని రీతిలో తమ వివాహా వెడ్డింగ్ కార్డులను ప్రింట్ చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ అది ఎలాగానుకుంటున్నారూ.. మీరు ఎంతమాత్రం ఊహించలేరంతే.

వివాహం చేసుకొనే వధువరులు అతిథులకు వెడ్డింగ్ కార్డులతో ఆహ్వానం పలికడం వెరీ కామన్ థింగ్. వివాహ కార్యక్రమాల్లో వచ్చే బంధువులకు రుచికరమైన విందు, వినోదాలతో పెళ్లివారు వారిని సర్ ప్రైజ్ చేస్తుంటారు. కానీ, గుజరాత్ కుటుంబానికి చెందిన ఓ కొత్త జంట వినూత్నంగా ఆలోచించింది. ఆ వధువరులే దావల్, జయ. ఎన్నడూ చూడని రీతిలో తమ వివాహా వెడ్డింగ్ కార్డులను ప్రింట్ చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ అది ఎలాగానుకుంటున్నారూ.. మీరు ఎంతమాత్రం ఊహించలేరంతే. వెడ్డింగ్ కార్డులో బంధువుల పేర్లకు బదులు ప్రధాని నరేంద్ర మోడీ పేరు, కమలం గుర్తును అచ్చు వెయ్యించారు.

అదేంటీ. ప్రధాని మోడీనే ప్రత్యేకంగా తమ పెళ్లికి ఆహ్వానించడానికి ఇలా చేసి ఉంటారునుకుంటే తప్పులో కాలేసినట్టే. అదేం కాదు.. త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి కదా? ఈ ఎన్నికల్లో మోడీకి ఓటు వేసి గెలిపించాలని తమ వెడ్డింగ్ కార్డులో ఈ గుజరాత్ ఫ్యామిలీ ఇలా సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అతిథులకు ఇచ్చిన వెడ్డింగ్ కార్డుల్లో.. 2019 ఎన్నికల్లో మోడీకి ఓటు వేయండి చాలు. అదే మీరు మాకిచ్చే విలువైన గిఫ్ట్.. అని ఫ్రింట్ వేయించారు. ఈ కార్డును ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. 

మరో వెడ్డింగ్ కార్డు వైరల్.. 
ఇది ఒక్కటే కాదు.. ఇలాంటి వెడ్డింగ్ కార్డు కూడా సూరత్ లో దర్శనమిచ్చింది. మంగళూరుకు చెందిన భూషణ్ బ్రాన్సన్ అనే వ్యక్తి తన వెడ్డింగ్ కార్డులో ఏకంగా మోడీ గవర్నమెంట్ అచీవ్ మెంట్స్ ను ఫ్రింట్ చేయించాడు. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.