Delhi Liquor Scam : తీహార్ జైలు సూపరింటెండెంట్‌పై కోర్టు ఆగ్రహం,మాగుంట రాఘవ బెయిల్ విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ బెయిల్ పిటీషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా కోర్టు తీహార్ జైలు సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం మాగుంట రాఘవ బెయిల్ విచారణను వాయిదా వేసింది.

Delhi Liquor Scam

Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ బెయిల్ పిటీషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా కోర్టు తీహార్ జైలు సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ బెయిల్ పిటీషన్ పై విచారణ జరుగుతుంటే రాఘవను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపర్చకపోవటంతో తీహార్ జైలు సూపరింటెండెంట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. శనివారం మరోసారి విచారణ జరుగనుందని అప్పుడు మాగుంట రాఘవను వర్చువల్ గా హాజరుపరచాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌ కు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం మాగుంట రాఘవ బెయిల్ పిటీషన్ విచారణను మార్చి 25కు వాయిదా వేసింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న మాగుంట రాఘవ ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తుంటారు.గత 70 ఏళ్లుగా లిక్కర్ బిజినెస్ చేస్తున్న మాగుంట కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది. దేశ వ్యాప్తంగా మాగుంట కుటుంబానికి పలు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయి.

కాగా ఈ కేసులో అరెస్ట్ అయిన మాగుంట రాఘవ తీహార్ జైల్లో ఉన్నారు. రాఘవతో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు. మాగుంట బెయిల్ కోసం యత్నిస్తున్నారు.

Delhi Liquor Scam : వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు .. మార్చి 18న విచారణకు రావాలని ఆదేశం