Delhi Liquor Scam : వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు .. మార్చి 18న విచారణకు రావాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్ అధికారపార్టీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 18న విచారణకు రావాలని ఆదేశించింది.

Delhi Liquor Scam : వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు .. మార్చి 18న విచారణకు రావాలని ఆదేశం

YCP MP Magunta Srinivasulureddy ED notices issued in delhi liquor scam Case

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎంపీ శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులుకి కూడా ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. శనివారం (మార్చి 18,2023) ఉదయం 11గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు కొనసాగుతున్న క్రమంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయటం ఏపీ రాజకీయాలు వేడెక్కనున్నాయి.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్‌

కాగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ లో అరెస్ట్ ల పర్వం దేశాన్ని కుదిపేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల గుండెల్లో గుబులు పుట్టిన్న క్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట రాఘవ అరెస్ట్ తో ఏపీ అధికార పార్టీకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న వైసీపీ ఎంపీ శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తుంటారు. గత 70 ఏళ్లుగా లిక్కర్ బిజినెస్ చేస్తున్న మాగుంట కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది. దేశ వ్యాప్తంగా మాగుంట కుటుంబానికి పలు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయి.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ లో ఇప్పటికే సుమారు 12మంది ఈ కేసులో అరెస్ట్‌ కాగా.. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఈక్రమంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయటంతో అధికార పార్టీ వైసీపీ ఉలిక్కిపడిందనే చెప్పాలి.

Magunta Raghava Judicial Custody : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాగుంట రాఘవకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

కాగా బాలాజీ గ్రూప్ పేరుతో డిస్టిలరీస్ కాకుండా, ఏంజెల్ షాంపైన్ ఎల్ఎల్పీ, తమిళనాడు డిస్టిలరీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఇతర కంపెనీలు మాగుంట కుటుంబానికి సంబంధించిన రెండు కీలక సంస్థలు సీబీఐ రాడార్లోకి వచ్చాయి. వీటి తయారీ, పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల ద్వారా మద్యం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 నియమాలు ఏ కంపెనీకి రెండు జోన్ల కంటే ఎక్కువ కేటాయించకూడదని స్పష్టంగా చేసినా.. పిక్సీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట ఆగ్రో ఫాష్ ప్రైవేట్ లిమిటెడ్లకు జోన్ 32, జోన్లకు జోనల్ రిటైల్ లైసెన్సులు లభించటం గమనించాల్సిన విషయం. ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట రాఘవ..తాజాగా ఎంపీ శ్రీనివాసులు రెడ్డిని ఈడీ విచారణకు రమ్మని ఆదేశించటం ఆసక్తికరంగా మారింది.