Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్‌

ED arrests YCP MP Magunta Srinivas Reddy's son Magunta Raghava in Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ లో అరెస్ట్ ల పర్వం దేశాన్ని కుదిపేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల గుండెల్లో గుబులు పుట్టిన్న క్రమంలో మరో అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీని షేక్ చేసింది. వైసీపీ ఎంపీ కుమారుడిని అరెస్ట్ తో మరోసారి అధికార పార్టీ వైసీపీ ఉలిక్కిపడింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఇలా అరెస్టుల పరంపరను కొనసాగిస్తున్న ఈడీ ఈ కేసు దర్యాప్తులో మాంచి దూకుడుమీదున్నట్లుగా తెలుస్తోంది. అరెస్ట్ చేసిన మాగుంట రాఘవను ఈరోజు మధ్యాహ్నాం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది.అనంతరం విచారణ కోసం కస్టడీలోకి తీసుకోనుంది.

బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న మాగుంట రాఘవ ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తుంటారు.గత 70 ఏళ్లుగా లిక్కర్ బిజినెస్ చేస్తున్న మాగుంట కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది. దేశ వ్యాప్తంగా మాగుంట కుటుంబానికి పలు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ లో ఇప్పటికే సుమారు 9 మంది ఈ కేసులో అరెస్ట్‌ కాగా.. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకోవటంతో అసలు ఫోన్ ట్యాపింగ్ లు మరోపక్క అప్పుల కుప్పగా మారిన రాష్ట్ర పరిస్థితులు..ఇంకోపక్క రానున్న ఎన్నికలు ఈ తరుణంలో వైసీపీ ఎంపీ కుమారుడు అరెస్ట్ తో వైసీపీ ఉలిక్కిపడిందనే చెప్పాలి.

కాగా బాలాజీ గ్రూప్ పేరుత డిస్టిలరీస్ కాకుండా, ఏంజెల్ షాంపైన్ ఎల్ఎల్పీ, తమిళనాడు డిస్టిలరీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఇతర కంపెనీలు మాగుంట కుటుంబానికి సంబంధించిన రెండు కీలక సంస్థలు సీబీఐ రాడార్లోకి వచ్చాయి. వీటి తయారీ, పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల ద్వారా మద్యం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 నియమాలు ఏ కంపెనీకి రెండు జోన్ల కంటే ఎక్కువ కేటాయించకూడదని స్పష్టంగా చెేసినా.. పిక్సీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్  మాగుంట ఆగ్రో ఫాష్ ప్రైవేట్ లిమిటెడ్లకు జోన్ 32, జోన్లకు జోనల్ రిటైల్ లైసెన్సులు లభించటం గమనించాల్సిన విషయం. ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట రాఘవ పాత్ర గురించి ఈడీ మరింతగా విచారణ చేయనుంది.



Community-verified icon