Magunta Raghava Judicial Custody : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాగుంట రాఘవకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరీ కేసులో మాగుంట రాఘవ రెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిలో ఉందన్న ఈడీ.. మాగుంట రాఘవ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది.

Magunta Raghava Judicial Custody : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాగుంట రాఘవకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Magunta Raghava

Magunta Raghava Judicial Custody : ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరీ కేసులో మాగుంట రాఘవ రెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిలో ఉందన్న ఈడీ.. మాగుంట రాఘవ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఫిబ్రవరి 10న మాగంటి రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ తరపున చెల్లించిన 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంలో మాగుంట రాఘవరెడ్డి పాత్ర ఉందని ఆరోపించింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన నిందితులతో రాఘవకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది.

Manish Sisodia Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుట్ర, ముడుపుల వ్యవహారంలో రాఘవ కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తోంది.
మార్చి 16న మాగుంట రాఘవ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ప్రస్తుతం మాగుంట రాఘవ రెడ్డి తీహార్ జైలులో ఉన్నాడు. ఫిబ్రవరి 10న మాగుంట రాఘవ రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వానికి 2,873 కోట్ల రూపాయల నష్టం నష్టం వాటిల్లింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఈడీ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి కస్టడీని రెండు రోజులపాటు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. తుదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.

Manish Sisodia: నాపై తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి తేవడం వల్లే సీబీఐ అధికారి ఆత్మహత్య: మనీష్ సిసోడియా

అయితే రాఘవ రెడ్డి బెయిల్ పిటిషన్ పై మార్చి 13వ తేదీన వాదనలు వింటామని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసు పురోగతిలో ఉందని మాగుంట రాఘవ రెడ్డి జ్యూడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టును కోరారు. ఈడీ వాదనలతో ఏకీభించిన కోర్టుజ.. మాగుంట రాఘవ రెడ్డి జ్యూడీషియల్ కస్టడీని 14 రోజులపాటు పొడిగించింది.